*డ్రగ్స్‌పై యుద్ధానికి నల్గొండ పరుగులు..!* *2కే రన్‌లో యువతతో కలిసి పరుగెత్తిన కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్*
*డ్రగ్స్‌పై యుద్ధానికి నల్గొండ పరుగులు..!*
*2కే రన్‌లో యువతతో కలిసి పరుగెత్తిన కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్*
*నల్గొండ:* "డ్రగ్ ఫ్రీ నల్గొండ – డ్రగ్ ఫ్రీ తెలంగాణ" లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం నల్గొండలో భారీ 2కే రన్ నిర్వహించారు. ఎన్జీ కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు జరిగిన ఈ రన్‌లో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ యువతతో కలిసి పరుగెత్తారు.
ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు "నో", ఆరోగ్యవంతమైన జీవితానికి "యెస్" అంటూ యువతకు పిలుపునిచ్చారు. డ్రగ్స్ విక్రయాలు, అక్రమ రవాణాపై సమాచారం ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, సమాజానికి చేటు తెస్తుందని అన్నారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తన జీవిత లక్ష్యాలపై దృష్టి సారించాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ శాఖలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులు, యువత, పోలీసు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని 2కే రన్‌ను విజయవంతం చేశారు. పాల్గొన్న వారందరూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐ నాగరాజు, ఎస్‌ఐలు సైదా బాబు, శివప్రసాద్, పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments
Post a Comment