*మ్యుటేషన్ కోసం రూ.15 వేలు లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, కారోబార్*

 



*మ్యుటేషన్ కోసం రూ.15 వేలు లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, కారోబార్*


*సిద్దిపేట, అక్టోబర్ 06:* సిద్దిపేట జిల్లాలో మరో అవినీతి ఉద్యోగి ఏసీబీ వలలో పడ్డారు. నారాయణరావుపేట మండలంలో పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది.

*AO-1: శ్రీమతి బి. అరుణ, పంచాయతీ కార్యదర్శి, జక్కాపూర్ గ్రామం, నారాయణరావుపేట మండలం*

*AO-2: దాసరి సంతోష్, కాంట్రాక్ట్ కారోబార్, జక్కాపూర్ గ్రామం*


అక్టోబర్ 06, 2026 ఉదయం 11 గంటల ప్రాంతంలో జక్కాపూర్ పంచాయతీ ఆఫీసులో ఇద్దరూ రూ.15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.


*అసలేం జరిగింది?*


ఫిర్యాదుదారుడి పేరు మీద రెండు ఇళ్లకు సంబంధించిన మ్యుటేషన్ దరఖాస్తు ఫైల్‌ను ఫార్వార్డ్ చేసి ప్రాసెస్ చేయడానికి పంచాయతీ కార్యదర్శి అరుణ లంచం డిమాండ్ చేసింది. మొదట రూ.20,000 అడిగి, చివరకు రూ.15,000 కు బేరం కుదుర్చుకుంది. ఆ డబ్బును కారోబార్ సంతోష్ ద్వారా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్నారు.


లంచం సొమ్ము రూ.15,000 ను AO-2 సంతోష్ వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమ లబ్ధి పొందేందుకు ప్రయత్నించారని ఏసీబీ తెలిపింది.


ఇద్దరు నిందితులను అరెస్టు చేసి హైదరాబాద్ లోని II అదనపు స్పెషల్ జడ్జి ఫర్ ట్రయల్ ఆఫ్ SPE & ACB కేసుల కోర్టులో హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు