Posts

🔥 తిరుమల VIP సేవల పేరుతో భారీ మోసం బహిర్గతం 🔥

Image
  🔥 తిరుమల VIP సేవల పేరుతో భారీ మోసం బహిర్గతం 🔥 హైద్రాబాద్:  “ఆ చానెల్‌లో మామ పనిచేస్తాడు…” అంటూ నమ్మించి, తిరుమలలో వీ ఐ పి సేవలు కల్పిస్తానని చెప్పి పలువురిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అభిషేకం, సుప్రభాత దర్శనాల పేరుతో 14 మంది భక్తుల నుంచి సుమారు రూ. 3.70 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొదట టికెట్లు ఏర్పాటు చేస్తానని చెప్పిన నిందితుడు, తర్వాత “టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి… నాలుగు రోజులు ఆగండి” అంటూ కాలయాపన చేసి, మరింత డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘరానా మోసానికి పాల్పడిన వ్యక్తి వినయ్ గౌడ్ ఆలూరి అని బాధితులు తెలిపారు. టికెట్ డబ్బులు తిరిగి వస్తాయని చెప్పి కాలయాపన చేస్తూ బాధితులను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మోసాన్ని గ్రహించిన బాధితుడు బాలాజీ, Banjara Hills Police Stationలో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  VIP దర్శనాల పేరుతో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

*"HMDAలో RTIకి 9 నెలల తాళం - ‘బై నేమ్’ లేఖను క్రిందిస్థాయి అధికారులే ప్రాసెస్ చేశారా?"*

Image
 *"HMDAలో RTIకి 9 నెలల తాళం - ‘బై నేమ్’ లేఖను క్రిందిస్థాయి అధికారులే ప్రాసెస్ చేశారా?"* *హైదరాబాద్, మే 2:* హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA)లో సమాచార హక్కు చట్టం అమలు తూట్లు పొడిచినట్టైంది. నల్గొండకు చెందిన సీనియర్ జర్నలిస్టు భూపతి రాజు వేసిన RTIకి 9 నెలలైనా సమాధానం లేదు. *ఏం అడిగారు?* 2025 జూలైలో భూపతి రాజు HMDAలోని అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులకు కేటాయించిన "వర్క్ అలాట్‌మెంట్ ఆఫీస్ ఆర్డర్" కాపీలు ఇవ్వాలని దరఖాస్తు చేశారు. ఎవరికి ఏ పని అప్పగించారో తెలిస్తే జవాబుదారీతనం పెరుగుతుందని ఆయన ఉద్దేశం. *9 నెలలు - సగం సమాచారం కూడా లేదు* దరఖాస్తు చేసి 9 నెలలు దాటినా సగం విభాగాల నుంచి కూడా సమాచారం రాలేదు. దీంతో ఆయన RTI చట్టం సెక్షన్ 18 కింద రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. *కమిషనర్ చూడకుండానే లేఖ క్లోజ్?* ఈ జాప్యంపై HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు నేరుగా, రాష్ట్ర సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయనకు తెలియజేసేందుకు ‘బై నేమ్’ లేఖను ఇన్వార్డ్‌లో ఇచ్చారు. అయితే బై నేమ్ లేఖను క్రిందిస్థాయి అధికారులు ప్రాసెస్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న...

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

Image
 *మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం* హైద్రాబాద్ : మహాసభ వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. సీనియర్ జర్నలిస్టు భూపతి రాజు దాఖలు చేసిన సమాచార హక్కు (RTI) దరఖాస్తును జిల్లా రిజిస్ట్రార్ తిరస్కరించినప్పటికీ, అప్పీల్ దశలో ఆయనకు న్యాయం లభించింది. అప్పిలేట్ అధికారి అయిన DIG పూర్తి స్థాయిలో విచారణ జరిపి, మహాసభ క్యాష్ బుక్, లెడ్జర్, సభ్యుల జాబితా వంటి కీలక సమాచారాన్ని వెంటనే సేకరించి అందించాలని జిల్లా రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.  ‘పబ్లిక్ అథారిటీ’గా మహాసభ – 5 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు కీలకం ఈ కేసులో ఒక ముఖ్య అంశం మహాసభను “పబ్లిక్ అథారిటీ”గా పరిగణించాల్సిన అవసరం. భూపతి రాజు తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వం ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో సుమారు 5 ఎకరాల భూమిని ఉచితంగా మహాసభకు కేటాయించింది. ప్రభుత్వ ఆస్తులు లేదా వనరులు పొందిన సంస్థలు ప్రజల పర్యవేక్షణకు లోబడతాయని, అందువల్ల అవి RTI చట్ట పరిధిలోకి వస్తాయని ఆయన వాదించారు. భూపతి రాజు మాట్లాడుతూ, “ఇది పారదర్శకత కోసం పోరాటంలో తొలి విజయం. గత 11 ఏళ్లుగా మహాసభ నాయకులు ఎలాంటి సర్వసభ్య సమావేశం నిర్వహించలేదు. అలాగే ఆర్థిక లావ...

నీతిగా పని చేసే అధికారికి సరెండర్ కానుక

Image
 నీతిగా పని చేసే అధికారికి సరెండర్ కానుక పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ గా నల్గొండ జిల్లా కు పని చేస్తున్న వ్యక్తి నీతి నిజాయితీకి "సరెండర్" కానుకగా లభించింది. వివరాల్లోకి వెళ్తే.. అక్రమార్కుల పని పట్టి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే అధికారికి తగు ప్రోత్సాహం ఉంటుంది.ఇందుకు భిన్నంగా.. "మీ సేవలు ఇక చాలు" అని నల్గొండ నుంచి పంపించేశారు. నిబద్దతగా విధి నిర్వహణ చేసే వారు అరుదు గా ఉంటారు.అలాంటి వారిలో పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ ఒకరు.చండూరు లో ఏళ్లుగా గ్యాస్ దందా చేస్తున్న మాఫియా పై ఉక్కు పాదం మోపారు.ప్రజల చేత "వారేవా సూపర్ ఆఫీసర్" అనిపించుకున్నారు.ఇంతలోనే ఎవరి కన్ను పడిందో ఏమో కానీ ఈ అధికారిని ఇక్కణ్ణుంచి ఎలా పంపడం అని తెగ ఆలోచించిన కొందరు వ్యక్తులు..చేసిన పథక "రచన" కు నల్గొండ యంత్రాంగం,రఘునందన్ ను కమీషనర్ కు రిపోర్ట్ చేయాల్సిందిగా సరెండర్ చేశారు. తగు న్యాయం కోసం రఘునందన్ కలెక్టర్ ను ఆశ్రయించారు

నల్గొండ పట్టణ రింగ్ రోడ్ నిర్మాణంలో మట్టి కుంభకోణం

Image
  నల్గొండ పట్టణ రింగ్ రోడ్ నిర్మాణంలో మట్టి కుంభకోణం అధికార విభాగాల వైఫల్యంతో పాటు రాజకీయ విమర్శలు ముదురుతున్నాయా? నల్గొండ పట్టణ అభివృద్ధికి కీలకంగా చేపట్టిన రింగ్ రోడ్ నిర్మాణ ప్రాజెక్టు ప్రస్తుతం తీవ్ర ఆరోపణల మధ్య కొనసాగుతోంది. మట్టి తరలింపు, నాణ్యత, బిల్లింగ్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో పాటు, వాటిని అడ్డుకోవాల్సిన రాష్ట్ర–కేంద్ర ప్రభుత్వ విభాగాల పర్యవేక్షణ వైఫల్యంపై రాజకీయ పార్టీల నుంచి కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మట్టి తరలింపులో అవకతవకల ఆరోపణలు నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేని ప్రాంతాల నుంచి మట్టి తవ్వి తరలిస్తున్నారన్న ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రోడ్డు ఎంబాంక్‌మెంట్‌కు అవసరమైన ప్రమాణాలు పాటించకుండా తక్కువ నాణ్యత గల మట్టి వాడుతున్నారని స్థానికులు అన్ని రాజకీయ పార్టీల వారు ఆరోపిస్తున్నారు. దీని వల్ల రింగ్ రోడ్ మన్నికపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బిల్లింగ్–పనుల మధ్య పొంతనపై అనుమానం చేసిన పనులకు చూపిస్తున్న బిల్లులు వాస్తవ పనులకు సరిపోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మట్టి పరిమాణాలను అధికంగా చూపించడం. వాస్తవంగా జరిగిన పనులకంటే ఎక్కువ బిల్లులు సమర్పించడం వంటి ...

ACB కి చిక్కిన, బిల్ కలెక్టర్, బీట్ ఆఫీసర్

Image
 గుండాల ఫారెస్ట్ రేంజ్‌లో ACB దాడి:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) వలలో ఫారెస్ట్ బీట్ అధికారి చిక్కాడు. 30-04-2026 తేదీన నడిమిగూడెం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీ బానోత్ నరేష్, ప్రస్తుతం సాయనపల్లి ఇన్‌చార్జ్‌గా కూడా విధులు నిర్వహిస్తున్నాడు. గుండాల ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని తన కార్యాలయంలో రూ.10,000 లంచం తీసుకుంటూ ACB అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వెంకటపురం రెవెన్యూ గ్రామంలో ఉన్న సుమారు 5 ఎకరాల పట్టా పోడు భూమిని, ప్రభుత్వం ఫిర్యాదుదారుడి తండ్రికి కేటాయించినప్పటికీ, ఆ భూమి సాగులో జోక్యం చేసుకోకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.10,000 స్వీకరిస్తుండగా అధికారులు అతన్ని పట్టుకున్నారు. అధికారుల సమాచారం ప్రకారం, లంచం మొత్తాన్ని నిందితుడి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. విధి నిర్వహణలో అవినీతి ప్రవర్తన ప్రదర్శించి అన్యాయ లాభం పొందేందుకు ప్రయత్నించినందుకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. తదుపరి చర్యల భాగంగా నిందితుడిని అరెస్ట్ చేసి, వరంగల్‌లోని SPE & ACB కేసుల ప్రత్యేక కోర్టు, మూడవ ...

తిరుపతిలో ప్రారంభమైన అయోధ్య వాసవీ సత్రం

Image
  తిరుపతిలో ప్రారంభమైన అయోధ్య వాసవీ సత్రం 🔹 రూమ్స్ బుకింగ్ నెంబర్ : 9989 249 679  🔹 నూతన భవనంలో అధునాతన సౌకర్యాలు 🔹 - ఫౌండర్ చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె హైదరాబాద్ : శ్రీ అయోధ్య వాసవీ ట్రస్ట్ వారి సత్రం సేవలను తిరుపతిలో ప్రారంభించారు. ఉదయం 9 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి, శ్రీ సీతారాములు, తిరుమల శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సత్రానికి శ్రీకారం చుట్టారు.       ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె మాట్లాడుతూ, తమ సత్రానికి వచ్చే యాత్రికులకు వసతి, భోజన, రవాణా ఏర్పాట్లతో పాటు శుచి, శుభ్రతలకు అధిక ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. గత ఏడాదికాలంగా అయోధ్యలో తెలుగు రాష్ట్రాలే కాకుండా దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన యాత్రికుల మన్ననలను పొందిన తమ సత్రం సేవలను, ప్రస్తుతం తిరుపతికి విస్తరించామని తెలిపారు. మొత్తం 18 పుణ్యక్షేత్రాల్లో సత్రాలు నెలకొల్పి, దక్షిణాది రాష్ట్రాల యాత్రికులకు సేవలు అందేలా ప్రతిపాదనలు చేశామని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు తిరుపతిలో ప్రారంభమైందన్నారు. త్వరలో అరుణాచలం, వారణాసి, నైమిశారణ్యం...