Posts

దేశ రాజకీయాల్లో పెను సంచలనం - బెంగాల్‌లో బీజేపీ, తమిళనాడులో విజయ్ హవా!**

Image
  దేశ రాజకీయాల్లో పెను సంచలనం - బెంగాల్‌లో బీజేపీ, తమిళనాడులో విజయ్ హవా!** **న్యూఢిల్లీ/హైదరాబాద్:** దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మే 4వ తేదీన జరిగిన ఓట్ల లెక్కింపులో ఓటరు తీర్పు స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ సామ్రాజ్యం కూలిపోగా, తమిళనాడులో 'దళపతి' విజయ్ రాజకీయ సునామీ సృష్టించారు.  **పశ్చిమ బెంగాల్: దీదీ కోటలో కమల వికాసం** దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన బెంగాల్ పోరులో **బీజేపీ** చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 200కు పైగా స్థానాలను కైవసం చేసుకుని మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీని గద్దె దించింది. 'సోనార్ బంగ్లా' నినాదంతో బీజేపీ ఓటర్లను ఆకట్టుకోగా, 15 ఏళ్ల అధికార వ్యతిరేకత టీఎంసీని దెబ్బతీసింది. **తమిళనాడు: ద్రవిడ కోటలో విజయ్ 'TVK' ప్రభంజనం** తమిళ రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. సినీ నటుడు విజయ్ స్థాపించిన **తమిళగ వెట్రి కళగం (TVK)** అంచనాలకు మించి రాణించింది. డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి దిగ్గజ పార్టీలను కాదని ప్రజలు విజయ్‌కు పట్టం కట్టారు. దీంతో దశాబ్దాల ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి బ్రేక్...

ఖైరతాబాద్ GHMC జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ వలలో

Image
 ఖైరతాబాద్ GHMC జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ వలలో హైదరాబాద్, మే 4: ఖైరతాబాద్ జోన్ పరిధిలోని GHMC సర్కిల్-37లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ వలలో చిక్కింది. అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సోమవారం ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే… రెవెన్యూ/ట్యాక్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీమతి బి. శ్రీలత ఒక వ్యక్తి నుంచి అధికారిక పని చేయించేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మొదటి విడతగా రూ.1 లక్ష స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ సమీపంలో ఆమెను పట్టుకున్నారు. ఇంటి నిర్మాణ అనుమతి (House Construction Permission) ప్రక్రియలో అనుకూలంగా వ్యవహరించేందుకు ఈ లంచం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పట్టుబడిన నగదు రూ.1 లక్షను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రసాయన పరీక్షలో ఆమె చేతులపై పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితురాలిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగ...

దిల్ దార్ తాసిల్దార్ - 'మాచన' మానవత్వం

Image
 *"దిల్ దార్ తాసిల్దార్ - 'మాచన' మానవత్వం"*   *"చదువు కోసం పరితపించిన అనాథ బాలుడికి అండగా నిలిచిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ"* *ముక్తల్, మే 3:* ఖాకీ చొక్కా వేసుకున్న ప్రతి ఒక్కరూ కఠినంగా ఉండరని, ఆ చొక్కా వెనుక కరిగే హృదయం కూడా ఉంటుందని నిరూపించారు పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్. *అసలు ఏం జరిగింది?*   ఆదివారం హైదరాబాద్ నుంచి ముక్తల్ మీదుగా పసుపులలోని దత్త క్షేత్రం సందర్శనకు వెళ్తున్న రఘునందన్, మార్గమధ్యలో కర్ని వద్ద రోడ్డుపై నడుస్తున్న ఓ బాలుడిని చూసి తన కారులో లిఫ్ట్ ఇచ్చారు.  ప్రయాణంలో ఆ కుర్రాడి పేరు అంజి అని, "సార్, మా నాయన తాగుబోతు. ఇల్లు పట్టించుకోడు. అమ్మ రోగిష్టి. నాకు చదువుకోవాలని ఉంది సార్, కానీ పైసలు లేవు" అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు.  చిన్న వయసులోనే జీవితంతో పోరాడుతున్న అంజి మాటలకు డీటీ రఘునందన్ చలించిపోయారు.  *అభయ హస్తం*   వెంటనే స్పందించిన రఘునందన్, "నువ్వు ధైర్యంగా చదువుకో అంజి. నీ చదువు ఖర్చు నేను భరిస్తాను" అంటూ అభయం ఇచ్చారు. అంతేకాదు, "మీ అమ్మను హైదరాబాద్ తీసుకురా, ఉచితంగా మంచి వైద్యం...

*"ఆవోపా హైదరాబాద్ సర్వసభ్య సమావేశం - నూతన కమిటీ ఎన్నిక"*

Image
*"ఆవోపా హైదరాబాద్ సర్వసభ్య సమావేశం - నూతన కమిటీ ఎన్నిక"*   *"మడుపల్లి రవి గుప్తా అధ్యక్షులుగా, ఎస్వీ సంపత్ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవం"* *హైదరాబాద్, మే 3:* *"గూఢచారి" న్యూస్ రిపోర్ట్*   ఆర్యవైశ్య ఆఫీసర్స్ & ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఆవోపా) హైదరాబాద్ శాఖ సర్వసభ్య సమావేశం శనివారం ముషీరాబాద్‌లోని వైశ్య హాస్టల్‌లో ఘనంగా జరిగింది. దాదాపు 150 మంది సభ్యులు హాజరైన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. *4 ఏళ్ల లెక్కలు ఆమోదం - 200 కార్యక్రమాలు*   సమావేశం ప్రారంభంలో గత నాలుగు సంవత్సరాలకు సంబంధించిన ఆడిట్ అకౌంట్స్‌ను సభ్యుల ముందుంచి ఆమోదం పొందారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రేణికుట్ల నమశివాయ మాట్లాడుతూ, "మా హయాంలో దాదాపు 200 సేవా కార్యక్రమాలు నిర్వహించాం. సభ్యులు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం" అని వివరించారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. *నూతన కమిటీ ఎన్నిక - ప్రమాణ స్వీకారం*   ప్రస్తుత కమిటీ పదవీకాలం ముగియడంతో, ముందుగానే ఏర్పాటు చేసిన ఎన్నికల కమిటీ షెడ్యూల్ ప్రకారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి పి...

🔥 తిరుమల VIP సేవల పేరుతో భారీ మోసం బహిర్గతం 🔥

Image
  🔥 తిరుమల VIP సేవల పేరుతో భారీ మోసం బహిర్గతం 🔥 హైద్రాబాద్:  “ఆ చానెల్‌లో మామ పనిచేస్తాడు…” అంటూ నమ్మించి, తిరుమలలో వీ ఐ పి సేవలు కల్పిస్తానని చెప్పి పలువురిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అభిషేకం, సుప్రభాత దర్శనాల పేరుతో 14 మంది భక్తుల నుంచి సుమారు రూ. 3.70 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొదట టికెట్లు ఏర్పాటు చేస్తానని చెప్పిన నిందితుడు, తర్వాత “టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి… నాలుగు రోజులు ఆగండి” అంటూ కాలయాపన చేసి, మరింత డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘరానా మోసానికి పాల్పడిన వ్యక్తి వినయ్ గౌడ్ ఆలూరి అని బాధితులు తెలిపారు. టికెట్ డబ్బులు తిరిగి వస్తాయని చెప్పి కాలయాపన చేస్తూ బాధితులను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మోసాన్ని గ్రహించిన బాధితుడు బాలాజీ, Banjara Hills Police Stationలో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  VIP దర్శనాల పేరుతో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

*"HMDAలో RTIకి 9 నెలల తాళం - ‘బై నేమ్’ లేఖను క్రిందిస్థాయి అధికారులే ప్రాసెస్ చేశారా?"*

Image
 *"HMDAలో RTIకి 9 నెలల తాళం - ‘బై నేమ్’ లేఖను క్రిందిస్థాయి అధికారులే ప్రాసెస్ చేశారా?"* *హైదరాబాద్, మే 2:* హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA)లో సమాచార హక్కు చట్టం అమలు తూట్లు పొడిచినట్టైంది. నల్గొండకు చెందిన సీనియర్ జర్నలిస్టు భూపతి రాజు వేసిన RTIకి 9 నెలలైనా సమాధానం లేదు. *ఏం అడిగారు?* 2025 జూలైలో భూపతి రాజు HMDAలోని అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులకు కేటాయించిన "వర్క్ అలాట్‌మెంట్ ఆఫీస్ ఆర్డర్" కాపీలు ఇవ్వాలని దరఖాస్తు చేశారు. ఎవరికి ఏ పని అప్పగించారో తెలిస్తే జవాబుదారీతనం పెరుగుతుందని ఆయన ఉద్దేశం. *9 నెలలు - సగం సమాచారం కూడా లేదు* దరఖాస్తు చేసి 9 నెలలు దాటినా సగం విభాగాల నుంచి కూడా సమాచారం రాలేదు. దీంతో ఆయన RTI చట్టం సెక్షన్ 18 కింద రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. *కమిషనర్ చూడకుండానే లేఖ క్లోజ్?* ఈ జాప్యంపై HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు నేరుగా, రాష్ట్ర సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయనకు తెలియజేసేందుకు ‘బై నేమ్’ లేఖను ఇన్వార్డ్‌లో ఇచ్చారు. అయితే బై నేమ్ లేఖను క్రిందిస్థాయి అధికారులు ప్రాసెస్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న...

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

Image
 *మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం* హైద్రాబాద్ : మహాసభ వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. సీనియర్ జర్నలిస్టు భూపతి రాజు దాఖలు చేసిన సమాచార హక్కు (RTI) దరఖాస్తును జిల్లా రిజిస్ట్రార్ తిరస్కరించినప్పటికీ, అప్పీల్ దశలో ఆయనకు న్యాయం లభించింది. అప్పిలేట్ అధికారి అయిన DIG పూర్తి స్థాయిలో విచారణ జరిపి, మహాసభ క్యాష్ బుక్, లెడ్జర్, సభ్యుల జాబితా వంటి కీలక సమాచారాన్ని వెంటనే సేకరించి అందించాలని జిల్లా రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.  ‘పబ్లిక్ అథారిటీ’గా మహాసభ – 5 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు కీలకం ఈ కేసులో ఒక ముఖ్య అంశం మహాసభను “పబ్లిక్ అథారిటీ”గా పరిగణించాల్సిన అవసరం. భూపతి రాజు తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వం ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో సుమారు 5 ఎకరాల భూమిని ఉచితంగా మహాసభకు కేటాయించింది. ప్రభుత్వ ఆస్తులు లేదా వనరులు పొందిన సంస్థలు ప్రజల పర్యవేక్షణకు లోబడతాయని, అందువల్ల అవి RTI చట్ట పరిధిలోకి వస్తాయని ఆయన వాదించారు. భూపతి రాజు మాట్లాడుతూ, “ఇది పారదర్శకత కోసం పోరాటంలో తొలి విజయం. గత 11 ఏళ్లుగా మహాసభ నాయకులు ఎలాంటి సర్వసభ్య సమావేశం నిర్వహించలేదు. అలాగే ఆర్థిక లావ...