‘సూటు-బూటు’ మేధావులారా... మీ ‘లెఫ్ట్’ అనాలసిస్‌లు సనాతన సంస్కృతి ముందు ఎంత?
గూఢచారి స్పెషల్: ‘సూటు-బూటు’ మేధావులారా... మీ ‘లెఫ్ట్’ అనాలసిస్‌లు సనాతన సంస్కృతి ముందు ఎంత? యూట్యూబ్ కెమెరాల ముందు కూర్చోవడం, సూటు-బూటు వేసుకుని గంభీరంగా గొంతు సవరించుకోవడం, తామేదో సమాజాన్ని ఉద్ధరించే ‘మేధావులం’ అని కలరింగ్ ఇచ్చుకోవడం... ఈ మధ్య కాలంలో కొందరు సోషల్ మీడియా విశ్లేషకులకు ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా లెఫ్ట్ సిద్ధాంతాల ముసుగులో, విశ్లేషణల పేరుతో సనాతన సంస్కృతిని, సంప్రదాయాలను టార్గెట్ చేయడం ఒక ట్రెండ్‌గా మార్చారు. కానీ వీరు గుర్తించని నిజం ఒక్కటే... ఈ దేశ మూలాలను కదిలించడం మీ యూట్యూబ్ థంబ్నైల్స్ మార్చినంత సులువు కాదు! 2000 ఏళ్ల చరిత్రే ఏం చేయలేకపోయింది.. మీరెంత? ఈ దేశంపై ఎందరో దండయాత్రలు చేశారు. 2000 ఏళ్లుగా ఎందరో పాలకులు ఈ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టాలని చూశారు. నలందా విశ్వవిద్యాలయాన్ని తగులబెట్టారు, దేవాలయాలను కూల్చారు, మతాంతర మార్పిడులకు ఒడిగట్టారు. కానీ, ఇంతటి పెనుతుఫానులను తట్టుకుని, కాల గర్భంలో కలిసిపోకుండా నేటికీ సజీవంగా, సగర్వంగా నిలబడింది మన భారతీయ సంస్కృతి. అలాంటి గొప్ప సంస్కృతిని, చరిత్రను... నాలుగు వ్యూస్ కోసం, కొన్ని లైక్స్ కోసం యూట్యూబ్ ఛ...