రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకం.. అందరికీ వనమా వెంకటేశ్వర్ల కృతజ్ఞతలు

 


రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకం.. అందరికీ వనమా వెంకటేశ్వర్ల కృతజ్ఞతలు

నల్గొండ: రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా వనమా వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేస్తూ, తనకు ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, చిట్యాల మండల నాయకులు, కార్యకర్తలు మరియు శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

గతంలో నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన సమయంలో అందించిన సహకారం మాదిరిగానే, ఇకపై రాష్ట్ర ఉపాధ్యక్షునిగా తన బాధ్యతల నిర్వహణలో కూడా నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నాయకులు, సభ్యులు అందరూ సహకరించాలని ఆయన కోరారు.

ఆర్యవైశ్య సమాజ అభ్యున్నతి, సంఘ బలోపేతం మరియు సామాజిక సేవా కార్యక్రమాల కోసం మరింత కృషి చేస్తానని వనమా వెంకటేశ్వర్లు తెలిపారు.

.

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముడిదుడ్డి శ్యాంసుందర్