రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ బంద్.. కదలని బస్సులు.. కార్మికుల అరెస్ట్‌లు

 



రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ బంద్.. కదలని బస్సులు.. కార్మికుల అరెస్ట్‌లు
ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్



బంద్‌కు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల మద్దతు
ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్


 


తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో 15 రోజుకు చేరుకోగా, నేడు కార్మిక సంఘాలు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌కు ఆర్టీసీ జేఏసీ, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. బంద్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్, ఆదిలాబాద్, నల్గొండ తదితర జిల్లాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.


మరోవైపు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోధన్ డిపో వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, హైదరాబాద్‌లోనూ బంద్ కొనసాగుతోంది. నగరంలోని పలు డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా కార్మికులు అడ్డుకున్నారు. మొత్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.


Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు