Skip to main content

అర్హులందరికి దళితబంధు అమలు చేస్తున్నాం - మంత్రి కొప్పుల ఈశ్వర్


 


అర్హులందరికి దళితబంధు అమలు చేస్తున్నాం - మంత్రి కొప్పుల ఈశ్వర్

దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులందరికి ప్రయోజనం చేకూరుతందని రాష్ర్ట సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం నాడు దళిత బంధుపథకం అమలుపై సంబంధిత శాఖ అధికారులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ సూచనలను పరిగణలోకి తీసుకొని ఒక్కో నిరుపేద దళితకుటుంబానికి 10 లక్షల అర్ధిక సాయన్ని అందచేస్తున్నట్లు వివరించారు. ఆర్ధికసాయం పొందిన లబ్దిదారులు వారికి నచ్చిన యూనిట్లు స్థాపించుకొని ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. ఒక్క జగిత్యాల జిల్లాలోనే 3500 మించి అప్లికేషన్లు వచ్చాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం యూనిట్లు గ్రౌండింగ్ పూర్తి అయ్యిందన్నారు. లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు యూనిట్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పైరవీలకు తావు లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరిని గుర్తించి యూనిట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయా నియోజకవర్గ శాసనసభ్యులు సూచించిన లబ్ధిదారులకు కూడా దళితబంధు పథకం వర్తింప చేస్తున్నట్లు మంత్రి కొప్పుల చెప్పారు. అక్కడక్కడ దళితబంధు పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ కావడం లేదంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అన్న రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులు నచ్చిన వ్యాపారం చేసుకునే సౌకర్యం కల్పిస్తుందని మంత్రి చెప్పారు.  ప్రభుత్వం ప్రకటించిన విధంగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరిగిందని వెల్లడించారు. ఈనెల 27న ఖమ్మం జిల్లా చింతకానిలో దళితబంధు పథకం అమలు తీరును స్వయంగా పరిశీలించనున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఎస్సీ కార్పోరేషన్ ఎండీ కరుణాకర్ పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్