హైదరాబాద్ కలెక్టర్ చేతుల మీదుగా NSPC 2025 పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్ కలెక్టర్ చేతుల మీదుగా NSPC 2025 పోస్టర్ ఆవిష్కరణ
జూలై 1 నుంచి విద్యార్థుల కోసం పర్యావరణ క్విజ్ పోటీకి నమోదు ప్రారంభం
హైదరాబాద్ జిల్లాలో నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ పోటీ (NSPC) 2025 పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. “వాతావరణ మార్పుల పర్యవసానాల నుండి రక్షణకు విద్యార్థులలో పర్యావరణ నైపుణ్యాలు, జీవనశైలిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మొక్కలు నాటటం, నీటి సంరక్షణ, వ్యర్థాల వేరుచేసే అలవాట్లను విద్యార్థులలో అలవరచాల్సిన అవసరం ఉంది,” అని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నేషనల్ గ్రీన్ కోర్ తయారుచేసిన పోస్టర్ ని విడుదల చేసి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం లోని అన్ని విద్యా సంస్థలు ఈ పోటీలో పాల్గొన వలసిందిగా పిలుపునిచ్చారు.
“HARIT – The Way of Life” అనే థీమ్పై దేశవ్యాప్తంగా NSPC పోటీని పర్యావరణ సంరక్షణ గతివిధి (PSG) నిర్వహిస్తోంది. ఈ పోటీకి జూలై 1 నుండి ఆగస్టు 21 వరకు రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుంది. ఈ పోటీకి కేంద్ర విద్యా, పర్యావరణ మంత్రిత్వ శాఖల సహాయ సహకారం ఉంది. ఫలితాలు ఆగస్టు 30న ప్రకటించబడతాయి.
1వ తరగతి నుండి పరిశోధన విద్యార్థుల వరకు ఐదు విభాగాలలో పోటీ నిర్వహించబడుతుంది. EcoMitram App ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలి. హిందీ, ఇంగ్లీష్, మరిన్ని భాషలలో క్విజ్ లభ్యం. రిజిస్ట్రేషన్ ఫీజు లేదు — మొక్క నాటుతున్న, నీరు సేవ్ చేస్తున్న లేదా వ్యర్థాలను వేరు చేస్తున్న సెల్ఫీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
గత సంవత్సరాలలో లక్షలాది మంది విద్యార్థులు పాల్గొన్న NSPC పోటీలో ఈ ఏడాది మరింత విస్తృతమైన విద్యార్థుల బాగస్వామ్యం ఆశిస్తున్నారు. అన్ని విద్యా సంస్థల ప్రధానులూ, ఉపాధ్యాయులూ విద్యార్థులను ప్రోత్సహించాలి. ఈ పోటీలో ఈసారి మరింత విశాలమైన భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నారు. పోటీ ఐదు విభాగాల్లో నిర్వహించబడుతుంది: 1వ తరగతి నుండి 5వ తరగతి, 6వ తరగతి నుండి 8వ తరగతి, 9వ తరగతి నుండి 12వ తరగతి, డిగ్రీ, పీజీ, పరిశోధన విద్యార్థులు ఇంతే కాక ఇతరులు / సామాన్య పౌరులు కూడా పాల్గొనవచ్చు. పోటీలో పాల్గొన్న ప్రతీ విద్యార్థికి E-సర్టిఫికెట్ లభిస్తుంది. విద్యా సంస్థలకూ ప్రత్యేక గుర్తింపు ఇవ్వబడుతుంది.
వివరాలకు:https://ecomitram.app/nspc
“నేడు చర్య తీసుకోండి – రేపు ఆలస్యం అవుతుంది!”
Comments
Post a Comment