Skip to main content

కల్వకుంట్ల కుటుంబం అంటే అబద్దాలకు విష ప్రచారాలకు పెట్టింది పేరు - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి


 కల్వకుంట్ల కుటుంబం అంటే అబద్దాలకు విష ప్రచారాలకు పెట్టింది పేరు - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి


నల్గొండ :;

మునుగోడు లోని 

కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  ప్రెస్ మీట్...


*కామెంట్స్....*


ముఖ్యమంత్రి గారు నిన్న జరిగిన చండూరు బహిరంగ సభలో అంతర్జాతీయ దేశ రాష్ట్ర సమస్యలతో పాటు మునుగోడు సమస్యలు మాట్లాడారు 


 ముఖ్యమంత్రి గారికి సూటి ప్రశ్న.... మీ పరిపాలనలో నైతికత ఉందా,, మీరు ఇచ్చిన హామీలు అమలు చేశారా...


 2014లో 2018లో 1,70000 ఎకరాలకు సాగు నీరు ఇస్తామని   చెప్పారు... ఒక్క అంగుళానికైనా నీరు ఇచ్చార


 నీటిపారుదల ప్రాజెక్టులకు ఎవరు అడ్డు వచ్చారు...


మీరు అనుకున్న ప్రాజెక్టులను పూర్తి చేశారు ఎవరైనా అడ్డొచ్చారా...


ప్రజల సమస్యలు చిన్న చిన్న సమస్యలు అంటున్నారు  వాటిని కనీసం తీర్చారా   


తొమ్మిది సంవత్సరాలు మీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించారు


మునుగోడు లో రోడ్ల పరిస్థితి భయంకరంగా ఉంది 


 9 సంవత్సరాలుగా చేయని ముఖ్యమంత్రి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే 15 రోజుల్లో పరిష్కరిస్తా అంటున్నాడు


 కొద్దిగా అయినా సిగ్గుండాలి ముఖ్యమంత్రికి  


15 రోజుల్లో ఏ రకంగా పరిష్కరిస్తారు


వంద పడకల ఆసుపత్రి,, ఐటిఐ  అన్నావ్ ఇన్నేళ్లుగా ఏం చేశావు 


బంగ్లాదేశ్ నేపాల్ పాకిస్తాన్ కంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుంగి పోయింది  అని పచ్చి అబద్దాలు  చెప్తున్నావు 


 ముఖ్యమంత్రి స్థాయిలో పశ్చి అబద్ధాలు చెప్తున్నావు 


కల్వకుంట్ల కుటుంబం అంటే అబద్దాలకు విష ప్రచారాలకు పెట్టింది పేరు


 మీ దగ్గర ఏదైనా అల్లావుద్దీన్ అద్భుతదీపం ఉందా 


9 సంవత్సరాలుగా చేయన అభివృద్ధి మునుగోడులో 15 రోజుల్లో ఏ రకంగా చేస్తారు 


మేం పర్యటిస్తున్న సందర్భంలో గ్రామ ప్రజలకు గ్రామంలో 18 బెల్ట్ షాపులు ఉన్నాయి 


గత తొమ్మిది సంవత్సరాలుగా గ్రామాలకు ఏం చేసింది అంటే బెల్టు షాపులు పెంచింది  


గ్రామాలకు రోడ్డు వేయకుండా,, వసతులు కల్పించకుండా,, రైతులకు లాభం చేకూర్చకుండా,, స్కూల్ పిల్లలకు విద్యా సౌకర్యం మెరుగుపరచకుండా...  కొద్దిపాటి గ్రామాలు సంపాదించుకునే డబ్బును దండుకునే విధంగా బెల్ట్ షాపులను పెంచి తెలంగాణ ప్రజలను ప్రభుత్వం దోపిడీ చేస్తుంది 


రాక్షస పాలన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది


నిన్నటి బహిరంగ సభలో నేను ఇక్కడ అభివృద్ధి చేయలేదని పరోక్షంగా ఒప్పుకున్నారు...


ముఖ్యమంత్రి వెంట ఏ ఎమ్మెల్యే కూడా హెలికాప్టర్లో వెళ్లడానికి వీల్లేదు కానీ నిన్న నలుగురు ఎమ్మెల్యేలను తన వెంట తీసుకొచ్చాడు 


ఆ నలుగురు ఎమ్మెల్యేలను చూపిస్తూ పార్టీ ఫిరాయింపుల   గురించి మాట్లాడుతున్నాడు 


 భాజప్గా మేము వేరే ఎమ్మెల్యేలు చేర్చుకుంటాము కానీ దానికి ఒక పద్ధతి ఉంది  వాళ్లు గెలిచిన పార్టీకి రాజీనామా చేసిన తర్వాత చేర్చుకుంటాము


మీలాగా ఇతర పార్టీలో గెలిచిన వారిని తీసుకొని మంత్రి పదవులు ఇచ్చే అ నైతికమైన విధానం మా పార్టీలో లేదు 


నిన్న మీరు తీసుకొచ్చిన నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు వేరే పార్టీతో గెలిచారు వాళ్లు కారు గుర్తుపైన గెలవలేదు


 వారిని చూపిస్తూ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు 


 పూసుకుంట్ల కాదు ఆయన కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 


మునుగోడు ఆత్మగౌరవాన్ని కెసిఆర్ కాల దగ్గర పెట్టాడు


 నిన్న బహిరంగ సభలో కేసీఆర్ చెప్పులను పట్టుకున్నాడు 


నిన్న మీరు తీసుకొచ్చిన నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ ప్రాతిపదికన మీ పార్టీలోకి  తీసుకున్నారో కూడా చెప్తే బాగుండేది 


 మేము చేరికల కోసం బహిరంగంగా మా పార్టీ ఈటెల రాజేందర్ గారి అధ్యక్షతన  ఒక కమిటీ వేసింది 


 మేము మీలాగా ఏమీ దాచుకోము


మా పార్టీలో చేరాలంటే డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదు... మంత్రి  పదవులు ఇచ్చే సంప్రదాయం మీకు ఉంది... చైర్మన్ లను చేసే సంప్రదాయం మీకుంది అడ్డంగా చేర్చుకునే సంప్రదాయం మీకుంది ఆత్మగౌరవాన్ని అడ్డంగా పెట్టి చేర్చుకునే సాంప్రదాయం మీకుంది


తెలంగాణ ఉద్యమ   ద్రోహులను చేర్చుకునే సాంప్రదాయం మీకుంది 


మీ వెంట ఉన్న మంత్రులు ఎంతమంది తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేశారో ప్రజలకు తెలుసు


 మీరు ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు సిపిఎంతో పొత్తు పెట్టుకున్నారు


తెలంగాణ వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం,, సిపిఎం...  అటువంటి పార్టీలతో పొత్తు పెట్టుకుంటారు మీరు 


బెదిరిస్తున్నారని అంటున్నారు మునుగోడు వస్తే తెలుస్తుంది ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారో 


 మీ టిఆర్ఎస్  జెడ్పిటిసి బిజెపి మహిళా కార్యకర్త పట్ల అసభ్యంగా ప్రవర్తించి అనైతికంగా మహిళలను అవమానం పరుస్తూ వేధిస్తున్నాడు  అటువంటి సంస్కృతి మీ టిఆర్ఎస్ పార్టీది 


ప్రపంచంలో అన్ని దేశాలతో పాటు ఇస్లామిక్ దేశాలు కూడా మహిళలను గౌరవిస్తున్నాయి... కానీ మీ పార్టీలో ఆ సంప్రదాయం లేదు


గతంలో ఏరకంగా వామపక్షాలను అవమానపరిచాడు ఒకసారి అవలోహన చేసుకోవాలి   


 రాష్ట్ర మొత్తం మీద ఒకే ఒక్క సీటు దేవరకొండ నుంచి సిపిఐ పార్టీ గెలుచుకుంది 


 అసెంబ్లీలో సిపిఐ ప్రాతినిధ్యం లేకుండా ఆ ఎమ్మెల్యేని టిఆర్ఎస్ లో చేర్చుకున్నాడు


అటువంటి కెసిఆర్ సిపిఐ పార్టీని పక్కన పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నాడు 


ఏ కమ్యూనిస్టులు అయితే మేము నిజాం ని తరిమి కొట్టామని చెప్తున్నారో, నేను రజాకార్లను ఊరికించారో...  అదే నిజాం వారసులైన ఎంఐఎం పార్టీతో అంటగాగుతున్న టిఆర్ఎస్ చంకలో చేరారు ఒక్కసారి పునరాలోచించండి...


మునుగోడు ఏది చేయలేకపోయాను, నన్ను క్షమించండి అని   మునుగోడు గడ్డమీద ముక్కు నేలకు రాస్తాడు అనుకున్న 


 మునుగోడు లో ఎన్ని ఇల్లు కట్టించాడో చెప్తాడు అనుకున్నాం చెప్పలేదు


 బిజెపికి ఓటేస్తే దేశమంతా ఆగమైపోతుంది అని అంటున్నాడు


బిజెపికి ఓటేస్తే దేశ గౌరవం పెరుగుతుంది... టిఆర్ఎస్ ఓట్ వేస్తే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కెసిఆర్ కాల దగ్గర తాకట్టుపెట్టిన వాళ్ళం అవుతాం


 టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే అవినీతి పెరుగుతుంది


 టిఆర్ఎస్ గెలిస్తే పేద ప్రజలకు ఇల్లులు రావు


పేద ప్రజలకు ఇల్లులు రావాలంటే కెసిఆర్ పాలన పోవాలి... నరేంద్ర మోడీ పాలన రావాలి


పక్కన ఆంధ్ర రాష్ట్రంలో 20వేల ఇల్లులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది


ఇక్కడ ఇచ్చిన రెండు లక్ష 20వేల ఇల్లులు అతీగతి లేదు.. 


 కేంద్రంలో అధికారులు ఉన్నది మేము కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో మేము స్పష్టంగా చెప్తాం నువ్వు కాదు 


మేము స్పష్టంగా చెప్పాం మోటార్లకు మీటర్లు ఉండవని


ఏ సర్కులర్ లో కూడా మీటర్లు పెట్టాలని ఏం చెప్పలేదు


ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా మోటర్లకు మీటర్లు పెట్టాలని నిబంధన కేంద్ర ప్రభుత్వం తీసుకురాలేదు.

.. ఒక క్యాబినెట్ మంత్రిగా చెబుతున్నా    



చెప్పిన మాటని పది సార్లు చెప్పడం కెసిఆర్ కి అలవాటయింది 


 నేత కార్మికులకు సంబంధించినటువంటి 40 లక్షల వరకు నేత కార్మికులకు ఎటువంటి జిఎస్టి లేదు


40 లక్షలు దాటిన తర్వాత ఐదు శాతం జీఎస్టీ ఏదైతే ఉందో  అప్పుడు జిఎస్టి కౌన్సిల్లో కేటీఆర్ ఉన్నాడు అప్పుడు ఏం చేశాడు 


ఈ ఐదు శాతం జీఎస్టీలో రెండున్నర శాతం మీ ఖజానాకు వస్తుంది కదా... మీరు దానికెందుకు రియంబర్స్మెంట్ చేయరు


 పెట్రోల్ పైన అత్యధికంగా వేట వసూలు చేస్తున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా


ఏ రాష్ట్రంలో లేని పెట్రోల్ ఛార్జి రేటు ఈ తెలంగాణలో ఉన్న మాట వాసం కాదా 


తొమ్మిది సంవత్సరాలుగా డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేని కేసీఆర్.... గత రెండు రోజుల నుంచి ఇంటింటికి  డబల్  బెడ్ రూమ్ పత్రాలు పంపించి టిఆర్ఎస్కు ఓటేస్తేనే డబల్ బెడ్ రూమ్ వస్తుందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు


తెలంగాణ వస్తే జర్నలిస్టులు అందరికీ ఇల్లు ఇస్తానని చెప్పాడు 


ఇప్పుడు మునుగోడులో ఇంటింటికి పంచిన ఫార్మ్స్ ఫిలప్ చేసి మీరు ఇస్తే 15 రోజుల్లో   మీకు కూడా డబల్ బెడ్ రూమ్ ఇల్లులు వస్తాయి


తన అవినీతి  నుండి తప్పించుకునే ప్రయత్నం... మీ కుటుంబాన్ని రక్షించుకునే ప్రయత్నం...  మీ పార్టీ నాయకుల్ని రక్షించుకునే ప్రయత్నం కోసం సిబిఐ ని రాష్ట్రానికి రాకుండా జీవో తెచ్చుకున్నారా....


అనేక సంవత్సరాల నుంచి ఈ దేశంలో శివే పనిచేస్తోంది ఇది పనిచేస్తుంది ఇన్కమ్ టాక్స్ పనిచేస్తుంది


సిబిఐ పని రోజు దర్యాప్తు చేయడమే 


 మీరు విమానాలు అనుకుంటున్నారు అంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది 


కొత్త కొత్త ఫామ్ హౌస్ కడుతున్నారు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి


బినామీల పేరుతో వేలకోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఎక్కడినుండి వచ్చాయి  



ప్రభుత్వ భూముల సెటిల్మెంట్లలో వేలకోట్ల రూపాయలు వసూలు చేస్తున్న మాట నిజంగాదా


మీలో చిత్తశుద్ధి ఉంటే ఈ నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారం సిబిఐకి ఇవ్వండి


 టిఆర్ఎస్ పార్టీ ఉన్నన్ని రోజులు గిరిజన రిజర్వేషన్లు రావు 


 బిజెపి అధికారంలోకి వచ్చిన మొదటి రోజే గిరిజన రిజర్వేషన్లు పెంచుతాం 


 మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం


అది మేము చెప్పేది కాదు స్వయంగా అంబేద్కర్ గారు చెప్పారు


గిరిజనుల కోసమని  మునుగోడు ఎన్నికకు ముందు మోసపూరితమైన జీవో తీసుకొచ్చి మోసపూరితమైన హామీలు ఇస్తున్నాడు...


 టిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ మేధావులకు తెలంగాణ కళాకారులకు తెలంగాణ కవులకు స్థానం లేదు


పచ్చి తెలంగాణ ద్రోహులకు వేదికగా మారింది టిఆర్ఎస్ 


కెసిఆర్ చేసేది అబద్ధపు పాలన, అహంకారపూరిత పాలన, రాక్షస పాలన, కుటుంబ పాలన


 కెసిఆర్ మాటలు నమ్మకండి


తెలంగాణ భవిష్యత్తు మునుగోడు చేతిలో ఉంది


మునుగోడులో టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పండి..


ఊహలోకంలో టిఆర్ఎస్ పార్టీ విహరిస్తుంది


తెలంగాణ రాష్ట్రం పూర్తిగా కలవకుండా కుటుంబం చెప్పు చేతల్లో ఉన్నది దీని పూర్తిగా విమర్క్తి చేయాలంటే మునుగోడు ఎన్నికలలో మునుగోడు ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించండి....


రాజగోపాల్ రెడ్డి కష్టాల్లో ఉన్న వాళ్లకి పైసలు ఇచ్చే ఆదుకుంటాడు తప్ప... ఎవరి దగ్గర కమిషన్ తీసుకోవడం మోసం చేయడం అనేది రాజగోపాల్ రెడ్డికి తెలియదు  ఇది నేను చెప్పే మాట కాదు ప్రజలు చెప్పే మాట


*ఆయన కోడిగుడ్లు అమ్ముకునే వ్యక్తి కాదు కోడిగుడ్లు ఇచ్చే వ్యక్తి* 


రాజగోపాల్ రెడ్డి రాజీనామా నిర్ణయం మంచి నిర్ణయంగా మేము భావిస్తున్నాం

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్