ACB కలకలం - పీడీఎస్ రైస్ వ్యాపారిని డబ్బు డిమాండ్



ACB కలకలం - పీడీఎస్ రైస్ వ్యాపారిని డబ్బు డిమాండ్ • కొంత డబ్బు తీసుకున్నారనే ఆరోపణలు • విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ACB కలకలం ఏసీబీ అదుపులో ఓ పోలీసు అధికారి

తొర్రూరు, గూఢచారి: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఓ పోలీస్ అధికారిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. గత సంవత్సరం దంతాలపల్లి వద్ద అధికారులు రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా జరుగుతుండగా పట్టుకున్నారు. ఈ కేసులో ఆదిలాబాద్ కు చెందిన ఓ నిందితుడి నుంచి పోలీసు అధికారి రూ.4లక్షలు డిమాండ్ చేసి రూ.2లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మిగతా డబ్బు కోసం తనకు కాల్ చేస్తుండటంతో నిందితుడు ఏసీబీ అధికారులను సంప్రదించినట్లు తెలుస్తుంది. తొర్రూర్ లో ఆరోపణలు

ఎదుర్కొంటున్న పోలీస్ అధికారిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. దీనిపై ఏసీబీ అధికారులు వివరాలను వెల్లడించాల్సి ఉంది. ఒక పోలీస్ అధికారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడం సంచలనం కలిగించిం

ది.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*