తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఏబీవీపీ


 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఏబీవీపీ


మిర్యాలగూడ: సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ కళాశాలలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ విమోచన కోసం పోరాడిన వీరులను, వారి త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు.


ఈ కార్యక్రమంలో ఏబీవీపీ మిర్యాలగూడ టౌన్ వైస్ ప్రెసిడెంట్ వంశీ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రను ప్రతి విద్యార్థి తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు. గత చరిత్ర మనకు ధైర్యంగా నిలబడటం, అన్యాయాన్ని ఎదుర్కోవడం, సమాజం పట్ల బాధ్యతగా ఉండటం వంటి విలువలను నేర్పిస్తుందని పేర్కొన్నారు.


విద్యార్థులు తమ బాధ్యతను గుర్తించి మంచిగా చదువుకుంటూ, సమాజానికి మరియు దేశానికి ఉపయోగపడే విధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో వరుణ్, నాగరాజు, వెంకట్, పార్థు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*