రూ.14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్


 *రూ.14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్*


*ఖమ్మం, సెప్టెంబర్ 17:* ఖమ్మం జిల్లాలో మరో ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు.


*ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడి*


చర్ల మండలం సత్యనారాయణపురం లోని *ఎస్టీ బాయ్స్ హాస్టల్ (ఐటీడీఏ)* లో వార్డెన్ గా పనిచేస్తున్న *భూక్యా వాల్ సింహ* తన హాస్టల్ లో పనిచేసే వర్కర్ (కుక్) జీతం బిల్లు చేయడానికి రూ.14,000/- లంచం డిమాండ్ చేశాడు.


లంచం ఇవ్వడం ఇష్టం లేని కుక్ ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి, ఈరోజు వార్డెన్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.


మారుమూల గిరిజన ప్రాంతాల నుండి కూడా ఏసీబీకి ఫిర్యాదులు వస్తుండటం గమనార్హం. ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో వరుస దాడులు విజయవంతంగా కొనసాగుతున్నాయి.


నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*