*చేవెళ్ల సబ్-ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడి - రూ.లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు అరెస్ట్*
*చేవెళ్ల సబ్-ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడి - రూ.లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు అరెస్ట్*
*రంగారెడ్డి, సెప్టెంబర్ 17, 2026:* రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్-ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. లంచం తీసుకుంటూ సబ్-ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ తో పాటు ఒక ప్రైవేట్ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
*ఏసీబీ కథనం ప్రకారం..*
చేవెళ్ల డివిజనల్ సబ్-ట్రెజరీ ఆఫీస్ లో పనిచేస్తున్న
- *AO-1: మాదిగ లక్ష్మయ్య - సబ్-ట్రెజరీ ఆఫీసర్*
- *AO-2: కావలి అనూరాధ - అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్*
ఒక ఉద్యోగి సస్పెన్షన్ కాలపు జీతం బిల్లులు రూ. 23,25,390/- మరియు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ బకాయిలు రూ. 4,29,000/- ప్రాసెస్ చేసినందుకు గాను రూ. 2,50,000/- లంచం డిమాండ్ చేశారు.
అందులో భాగంగా రూ. 1,00,000/- తీసుకుంటుండగా ఏసీబీ రంగారెడ్డి రేంజ్ అధికారులు వల వేసి పట్టుకున్నారు.
AO-1 లక్ష్మయ్య రూ. 50,000/- నేరుగా తీసుకోగా, AO-2 అనూరాధ చెప్పడంతో మిగిలిన రూ. 50,000/- ను *A3: వడ్డే జంగయ్య @ చిన్న (ప్రైవేట్ వ్యక్తి)* తీసుకున్నాడు. ఇద్దరి నుండి లంచం సొమ్మును ఏసీబీ స్వాధీనం చేసుకుంది.
ముగ్గురు నిందితులను నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించనున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే *1064* టోల్ ఫ్రీ నంబర్ కు లేదా వాట్సాప్ నంబర్ *9440446106* కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ కోరింది.

Comments
Post a Comment