12 ఎస్సీ గురుకుల జూనియర్ కళాశాలల మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి - పాలడుగు నాగార్జున


 


*12 ఎస్సీ గురుకుల జూనియర్ కళాశాలల మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి*. 

పాలడుగు నాగార్జున

కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి. 

నల్గొండ,(గూఢచారి): 

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితoగా తీసుకున్న నిర్ణయం సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల లను రాష్ట్రవ్యాప్తంగా 12 కళాశాలలను మూసివేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కే వి పి ఎస్) జిల్లాప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల జూనియర్ కళాశాలలో విద్యార్థులు లేరని సాకుతో జూనియర్ కళాశాల మూసివేయడం హేయమైన చర్య అని అన్నారు. ప్రభుత్వం అడ్మిషన్ల ప్రక్రియ జాప్యం వల్లనే గురుకుల జూనియర్ కళాశాలలో విద్యార్థులు చేరలేకపోతున్నారని అన్నారు. కళాశాలలో అడ్మిషన్లు విద్యా సంవత్సరం ప్రారంభంలో నే తక్షణ ప్రవేశాల విధానం అమలు చేయడం లేదని అన్నారు.దీని వలన ప్రైవేట్ కాలేజీలకు విద్యార్థులను దోచుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. విద్యార్థులు లేరనే సాకు అసంబడ్డమైన్నాడని అన్నారు. బహిరంగ విచారణ కు సిద్దామా అన్నారు. అడ్మిషన్లు జాప్యం చేయడం వలన గురుకుల జూనియర్ కళాశాలలో అడ్మిషన్ విద్యార్థులు పొందలేకపోతున్నారని అన్నారు. గురుకులల్లో జూనియర్ కళాశాలను మూసి వేయడం వల్ల పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా 12 జూనియర్ కళాశాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్