*ఐవీఎఫ్ కేంద్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు జన్మదిన శుభాకాంక్షలు* - కోటగిరి దైవాధీనం*




*ఐవీఎఫ్ కేంద్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు జన్మదిన శుభాకాంక్షలు* - కోటగిరి దైవాధీనం* 


*హైదరాబాద్:* ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) కేంద్ర కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ శాఖ అధ్యక్షుడు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదిన వేడుకలను ఐవీఎఫ్ నాయకులు ఘనంగా నిర్వహించారని ఐవీఎఫ్ తెలంగాణ మీడియా కమిటీ చైర్మన్ కోటగిరి దైవాధీనం  తెలిపారు.


మే 5వ తేదీన శ్రీనివాస్ గుప్తా పుట్టినరోజు కాగా, ఆ రోజు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కామాఖ్య దేవి ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొంది, గత రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారని  పేర్కొన్నారు.


ఈ సందర్భంగా శనివారం ఉదయం ఐవీఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రేపాల భద్రాద్రి ఆధ్వర్యంలో జిల్లా కోశాధికారి గోవిందు బాలరాజుతో కలిసి హైదరాబాద్‌లో శ్రీనివాస్ గుప్తాను కలిసి కేక్ కటింగ్ చేసి, శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారని తెలిపారు.


ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ రాష్ట్ర కోశాధికారి నారాయణ, యువజన విభాగం కోశాధికారి నరేష్, గజ్వేల్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు తూముకుంట నర్సిరెడ్డి, ఐవీఎఫ్ నాయకులు ప్రవీణ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారని వివరించారు.


ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా-స్వప్న దంపతులు తమ ఉప్పల ఫౌండేషన్ ద్వారా ముగ్గురు పేద వధువులకు పుస్తెమెట్టెలు, నూతన వస్త్రాలు బహుకరించారని కోటగిరి దైవాధీనం  పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*