*ఉప్పల ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది*




*ఉప్పల ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది*  

*పేదింటి ముగ్గురు ఆడపిల్లల వివాహాలకు పుస్తెమెట్టెలు, చీరెలు పంపిణీ*  

*కులాలకు అతీతంగా ఉప్పల దంపతుల సేవలు*


*నాగోల్, గూఢచారి:* సమాజ సేవలో తనదైన ముద్ర వేసుకుంటున్న ఉప్పల ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది. నాగోల్‌లోని ఉప్పల క్యాంపు కార్యాలయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త, ఐవీఎఫ్ ప్రథమ మహిళ ఉప్పల స్వప్న దంపతులు ముగ్గురు పేదింటి ఆడపిల్లల వివాహాలకు పుస్తెమెట్టెలు, చీర, గాజులు అందజేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారు.


కులమతాలకు అతీతంగా సాయం అందిస్తున్న ఉప్పల దంపతులు ఈసారి ముదిరాజ్, వైశ్య సామాజిక వర్గాలకు చెందిన మూడు కుటుంబాలకు అండగా నిలిచారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం సిరసముందర్‌కు చెందిన నీరడి సాత్విక, షామీర్‌పేటకు చెందిన రాపాని లలిత, ఓల్డ్ మలక్‌పేటకు చెందిన ఎడ్ల శివాని వివాహాలకు కావాల్సిన మంగళసూత్రాలు, నూతన వస్త్రాలను అందించారు. శివాని తండ్రి పక్షవాతంతో మంచాన పడగా, తల్లి కూలీ పనులతో కుటుంబాన్ని పోషిస్తున్న దీనస్థితిని తెలుసుకుని ఉప్పల దంపతులు తక్షణమే స్పందించి సాయం అందించడం విశేషం.


ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ “ఉప్పల ఫౌండేషన్ ద్వారా పేదలకు సేవ చేయడమే మా ప్రధాన ధ్యేయం. ఆడపిల్లల పెళ్లి సమయంలో తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో వందలాది కుటుంబాలకు పుస్తెమెట్టెలు, చీరెలు అందజేస్తున్నాం. పేదింటి ఆడపిల్లల మొహంలో చిరునవ్వు చూడటమే మాకు దక్కే గొప్ప బహుమతి. ఈ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులోనూ ఆగవు” అని అన్నారు.


కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు తూముకుంట నర్సిరెడ్డి, ఆర్య వైశ్య సంఘం నాయకులు కొలిపాక నారాయణ, దైవాధీనం, భద్రాద్రి, భద్రకాళి ఆలయ డైరెక్టర్ వీరన్న, నరేష్ గుప్త, ప్రవీణ్ గుప్త, శ్రీధర్ గుప్తతో పాటు పలువురు ఐవీఎఫ్ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించారు. ఉప్పల దంపతుల సేవా దృక్పథాన్ని పలువురు కొనియాడారు.


*- గూఢచారి ప్రతినిధి*

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్