ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు
*నల్గొండలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు*
*నల్గొండ, సెప్టెంబర్ 27:* నల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ గారి 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు *కట్టెల శివకుమార్* మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం రజాకార్లను ఎదిరించి పోరాడిన గొప్ప ధీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఆమె జీవితం నేటి మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరూ ఆమె ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే నల్గొండ జిల్లా మహిళా డిగ్రీ కళాశాలకు చాకలి ఐలమ్మ పేరును నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కొండూరు సత్యనారాయణ, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు బండారు శంకర్, కమ్మల నరేష్ కుమార్, సంఘం గౌరవ సలహాదారులు కందుల విజయ్ కుమార్, మాజీ సర్పంచ్ ఆదిమల్ల లింగయ్య, పెన్షనర్స్ యూనియన్ జిల్లా నాయకులు ఎస్.కె. జానీమియా, జిల్లా నాయకులు ఈరిగి బిక్షం, కొండన్న, సుధీర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment