గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సత్తా చాటుతాం… పట్టభద్రుల MLC స్వతంత్ర అభ్యర్థి మెండెం కిరణ్ కుమార్
పట్టభద్రుల MLC స్వతంత్ర అభ్యర్థి మెండెం కిరణ్ కుమార్
నల్లగొండలో యువ ఆత్మీయ సమ్మేళనం గ్రాండ్ సక్సెస్
రెండు వేలకు పైగా తరలివచ్చిన పట్టభద్రులు
నల్లగొండ, సెప్టెంబర్ 27
గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సత్తా చాటుతామని ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి మెండెం కిరణ్ కుమార్ అన్నారు. ఆదివారం నల్లగొండలోని రత్న ఫంక్షన్ హాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా యువ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా
ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి మెండెం కిరణ్ కుమార్ మాట్లాడుతూ… లక్షలాది మంది నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే పట్టభద్రుల సమస్యలు తెలిసిన తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులకు చాలా రకాల సమస్యలు ఉన్నాయని అన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో తనతో కలిసి ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువత అండతో విజయం సాధించి తీరుతానని మెండెం కిరణ్ కుమార్ ఆశాభావం వ్యక్తంచేశారు.
యువత రాజకీయాల్లో రాణించాలి…విద్యావేత్త ప్రసన్న హరికృష్ణ
నిరుద్యోగ యువత సమస్యలు పరిష్కారం కావాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని ప్రముఖ విద్యావేత్త ప్రసన్న హరికృష్ణ స్పష్టం చేశారు. ఆదివారం నల్లగొండలోని రత్న ఫంక్షన్ హాల్లో జరిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లా యువ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ..యువత రాజకీయాల్లోకి రావడం సంతోషంగా ఉందన్నారు. తన ఆర్ సీ అకాడమీ ఆధ్వర్యంలో
వేలాది మందికి ఉద్యోగాలు కల్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన మెండెం కిరణ్ కుమార్ లాంటి వారికి మనం అండగా నిలవడం అభినందనీయం అన్నారు. నేడు దేశ వ్యాప్తంగా జరుగుతున్న జెన్ జీ యువత స్ఫూర్తితో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశ, రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చగలిగిన సత్తా ఒక్క యువతకే ఉందన్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థి మెండెం కిరణ్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించి చట్టసభలకు ప్రాతినిధ్యం వహించేలా కృషి చేయాలని కోరారు.
నల్లగొండ జిల్లా యువ ఆత్మీయ సమ్మేళనం గ్రాండ్ సక్సెస్
నల్లగొండ జిల్లా కేంద్రంలోని రత్న ఫంక్షన్ హాల్ లో జరిగిన యువ ఆత్మీయ సమ్మేళనానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పట్టభద్రులు అంచనాలకు మించి భారీగా హాజరయ్యారు. సుమారు రెండు వేలకు పైగానే యువత తరలివచ్చారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకు టాలెంట్ టెస్ట్ ద్వారా ఉత్తమ మార్కులు సాధించిన యువతకు రైట్ చాయిస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ రూ. 55 వేలను నగదు బహుమతిని అందించారు.
ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జే ఏ సి నేతలు వంశీ, ఇంద్ర నాయక్, స్మార్ట్ ప్రవీణ్, శంభు నాయక్, నవీన్ పట్నాయక్, చెర్రీ ప్రవీణ్, నరసింహ, బాలకోటి, చేకూరి చైతన్య, సుమన్ తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment