*గోవిందరావుపేట తహశీల్దార్ ఏసీబీ వలలో.. రూ.14 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం*
*గోవిందరావుపేట తహశీల్దార్ ఏసీబీ వలలో.. రూ.14 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం*
*ములుగు జిల్లా, సెప్టెంబర్ 18:* ములుగు జిల్లాలో అవినీతి అధికారి ఆట కట్టించింది ఏసీబీ. గోవిందరావుపేట మండల తహశీల్దార్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.
వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారులు గోవిందరావుపేట MRO ఆఫీసులో దాడి చేసి తహశీల్దార్ *నెల్లుట్ల సృజన్ కుమార్* ను పట్టుకున్నారు.
*అసలేం జరిగింది?*
ఫిర్యాదుదారుడి భార్య లింగాల శ్రీలత పేరు మీద పూర్వీకుల వ్యవసాయ భూమిని వారసత్వంగా మార్చేందుకు (Succession) తహశీల్దార్ రూ.15,000 లంచం అడిగాడు. బేరం ఆడాక రూ.14,000 కు ఒప్పుకున్నాడు.
లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు వల వేశారు. ఈరోజు రూ.14,000 తీసుకుంటుండగా తహశీల్దార్ ను పట్టుకున్నారు. లంచం డబ్బును కుడి చేతితో తీసుకుని ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. అతని చేతివేళ్లకు కెమికల్ టెస్ట్ చేయగా పింక్ కలర్ గా మారి పాజిటివ్ వచ్చింది.
నిందితుడిని అరెస్ట్ చేసి వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.

Comments
Post a Comment