మా ఉద్యమంలో సమాజం కలిసి రావాలి.- టి. సంతోష్ చక్రవర్తి, జిల్లా అధ్యక్షులు, టిడబ్ల్యూజేఎఫ్
*మా ఉద్యమంలో సమాజం కలిసి రావాలి.- టి. సంతోష్ చక్రవర్తి, జిల్లా అధ్యక్షులు, టిడబ్ల్యూజేఎఫ్ *జర్నలిస్టుల నివాస హక్కు కోసం ఖమ్మంలో టిడబ్ల్యుజెఎఫ్ మోటార్ సైకిల్ ర్యాలీ..* *జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి బర్త్ డే సందర్భంగా అన్నం సేవ ఫౌండేషన్ లో పండ్లు పంపిణీ.* ఖమ్మం | జనవరి 2 అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టుల ఇండ్ల సాధన లక్ష్యంగా సమాజం జర్నలిస్టులకు తోడుగా కలిసి రావాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్– హెచ్ 2843) ఖమ్మం జిల్లా అధ్యక్షులు టి. సంతోష్ చక్రవర్తి పిలుపు నిచ్చారు. శుక్రవారం టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సంతోష్ చక్రవర్తి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగరంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి, అన్నం సేవా ఫౌండేషన్ లో అనాధ, అభాగ్యులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంతోష్ చక్రవర్తి మాట్లాడుతూ సమాజం జర్నలిస్టులకు తోడుగా నిలబడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేవలం సానుభూతిగా మాత్రమే కాదని, అది సమాజ స్వీయరక్షణ కోసం అని అన్నారు. ప్రజాస్వామ్యంలో సత్యాన్ని వెలికి తీయడం, అన్యాయాన్ని ప్రశ్నించడం, పాలకులకు బాధ్యతను గుర్తుచ...