*ఉప్పల ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది*
*ఉప్పల ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది* *పేదింటి ముగ్గురు ఆడపిల్లల వివాహాలకు పుస్తెమెట్టెలు, చీరెలు పంపిణీ* *కులాలకు అతీతంగా ఉప్పల దంపతుల సేవలు* *నాగోల్, గూఢచారి:* సమాజ సేవలో తనదైన ముద్ర వేసుకుంటున్న ఉప్పల ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది. నాగోల్‌లోని ఉప్పల క్యాంపు కార్యాలయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త, ఐవీఎఫ్ ప్రథమ మహిళ ఉప్పల స్వప్న దంపతులు ముగ్గురు పేదింటి ఆడపిల్లల వివాహాలకు పుస్తెమెట్టెలు, చీర, గాజులు అందజేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. కులమతాలకు అతీతంగా సాయం అందిస్తున్న ఉప్పల దంపతులు ఈసారి ముదిరాజ్, వైశ్య సామాజిక వర్గాలకు చెందిన మూడు కుటుంబాలకు అండగా నిలిచారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం సిరసముందర్‌కు చెందిన నీరడి సాత్విక, షామీర్‌పేటకు చెందిన రాపాని లలిత, ఓల్డ్ మలక్‌పేటకు చెందిన ఎడ్ల శివాని వివాహాలకు కావాల్సిన మంగళసూత్రాలు, నూతన వస్త్రాలను అందించారు. శివాని తండ్రి పక్షవాతంతో మంచాన పడగా, తల్లి కూలీ పనులతో కుటుంబాన్ని పోషిస్తున్న దీనస...