అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ
అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ నల్లగొండ, జూలై 30: చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానం పరిసరాల్లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన రెండు కుటుంబాలకు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో రూ.2.30 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. బుధవారం రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ దేవస్థానాన్ని సందర్శించి, అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన ఇళ్లు, దుకాణాలను పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయంగా చెక్కులను అందజేశారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తరఫున రంగా శ్రవణ్ కుమార్కు రూ.1 లక్ష, కర్నాటి యెల్లయ్యకు రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేశారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ తరఫున రూ.20 వేల నగదు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున కార్యదర్శి రేపాల భద్రాద్రి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. మొత్తంగా రెండు కుటుంబాలకు రూ.2.30 లక్షల సహాయం అందింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కొండే మల్లికార్జున్, కోశాధికారి రేణిగుంట గణేష్ గుప్తా, ఆర్గనైజేషన్ సెక్రటరీ ఇడుకుళ్ళ రామకృష్ణ, కోఆర్డిన...