*TGREDCO డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు*

 



*TGREDCO డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు*  

*మాదాపూర్ తో పాటు 10కి పైగా ప్రాంతాల్లో ఏకాల తనిఖీలు*


*హైదరాబాద్:* తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ - TGREDCO డిప్యూటీ ఇంజనీర్ ముత్యం వెంకటరమణ ఇంట్లో మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు సోదాలు ప్రారంభించారు.


మాదాపూర్‌లోని ఆయన నివాసంతో పాటు రాష్ట్రంలోని 10కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. 


డీఎస్పీ మాజి ఖాన్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం.


అధికారులు ఇంట్లోని పత్రాలు, బ్యాంక్ లావాదేవీలు, ఆస్తి వివరాలను పరిశీలిస్తున్నారు. 


ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


*- నివేదిక*

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు