కేటీఆర్‌కు కోర్టు ఆదేశాలు – రూ.1 లక్ష పూచీకత్తు ఆమోదం, విచారణ వాయిదా
కేటీఆర్‌కు కోర్టు ఆదేశాలు – రూ.1 లక్ష పూచీకత్తు ఆమోదం, విచారణ వాయిదా హైదరాబాద్: ఫార్ములా ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు (కేటీఆర్) శుక్రవారం నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరయ్యారు. కోర్టు ఆయన సమర్పించిన రూ.1 లక్ష వ్యక్తిగత పూచీకత్తును (Personal Bond) ఆమోదిస్తూ, తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది. అలాగే, తదుపరి విచారణ రోజున రూ.1 లక్ష చొప్పున మరో ఇద్దరు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. కేటీఆర్ తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ, ఈరోజు కోర్టులో ఛార్జ్‌షీట్‌తో పాటు సంబంధిత పత్రాలను మాత్రమే సమర్పించామని, కేసు మెరిట్స్‌పై ఎలాంటి వాదనలు జరగలేదని తెలిపారు.