*పోడు సాగు కోసం రూ.30 వేలు లంచం - ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్*
*పోడు సాగు కోసం రూ.30 వేలు లంచం - ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్* *భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 3:* పోడు సాగును అడ్డుకోకుండా, కందకాలు తవ్వకుండా ఉండేందుకు రూ.30 వేలు లంచం డిమాండ్ చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అల్లాపల్లి మండలం, కచనపల్లి బీట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు రామానుజగూడెం బీట్ ఇన్‌చార్జ్ గా ఉన్న *బానోత్ రవి కుమార్ (A-1)* ను ఏసీబీ అధికారులు బుధవారం ట్రాప్ చేశారు. ఫిర్యాదుదారుడి పోడు వ్యవసాయాన్ని అడ్డుకోకుండా, భవిష్యత్తులో పట్టా/రెగ్యులరైజేషన్ వచ్చేలా సహకరిస్తానని చెప్పి రవి కుమార్ రూ.30,000 లంచం డిమాండ్ చేశాడు. లంచం నేరుగా తీసుకోకుండా తన మనిషి *పఠాన్ సాదిక్ ఖాన్ (A-2)* కు ఇవ్వాలని ఫిర్యాదుదారుడికి చెప్పాడు. ఏసీబీ పథకం ప్రకారం ఫిర్యాదుదారుడు రామానుజగూడెం గ్రామంలోని సాదిక్ ఖాన్ నివాసంలో రూ.30 వేలు అందజేశాడు. వెంటనే ఏసీబీ అధికారులు దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. A-2 చేతులపై నిర్వహించిన కెమికల్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. A-1 అధికార దుర్వినియోగానికి పాల్పడి A-2 ద్వారా లంచం తీసుకున్నట్లు ఏసీబీ నిర్ధారించింది. ఇద్దరు నింద...