*జైల్లో ములాఖత్ కోసం రూ.10 వేలు లంచం - ఏసీబీ వలలో హుజూరాబాద్ జైలర్*
*జైల్లో ములాఖత్ కోసం రూ.10 వేలు లంచం - ఏసీబీ వలలో హుజూరాబాద్ జైలర్* *కరీంనగర్, సెప్టెంబర్ 7:* రిమాండ్ ఖైదీకి మెరుగైన సౌకర్యాలు కల్పించి, ములాఖత్ లు ఇప్పించేందుకు, ఖమ్మం జైలుకు బదిలీ చేయకుండా ఉండేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటూ హుజూరాబాద్ సబ్ జైలు జైలర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సబ్ జైలు డిప్యూటీ జైలర్ గా పనిచేస్తున్న *N. దేవేందర్ (46) (A-1)* ను, అతని అనుచరుడు ఇండియన్ ఆయిల్ సబ్ జైలు పెట్రోల్ బంక్ ఆపరేటర్ *రావుల హరీష్ (30) (A-2)* ను కరీంనగర్ ఏసీబీ యూనిట్ అధికారులు ఆదివారం సాయంత్రం 5.45 గంటలకు ట్రాప్ చేశారు. *ఏం జరిగింది?* ఫిర్యాదుదారుడి మామ రిమాండ్ ఖైదీగా హుజూరాబాద్ సబ్ జైలులో ఉన్నాడు. అతనికి మెరుగైన వసతులు కల్పించడం, కుటుంబ సభ్యులను కలిసేందుకు ములాఖత్ సౌకర్యం కల్పించడం, ఖమ్మం జైలుకు బదిలీ చేయకుండా చూడడం కోసం జైలర్ దేవేందర్ రూ.10,000 లంచం డిమాండ్ చేశాడు. లంచాన్ని నేరుగా తీసుకోకుండా పెట్రోల్ బంక్ ఆపరేటర్ హరీష్ ద్వారా తీసుకోవాలని ప్లాన్ చేశాడు. ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు వల వేశారు. హుజూరాబాద్ లోని ఇండియన్ ఆయిల్ సబ్ జైలు పెట్రోల్ బంక్ వద్...