*భూగర్భ జలాలకు బదులు శుద్ధి చేసిన వ్యర్థజలాల వినియోగం.. పరిశ్రమలకు TGPCB దిశానిర్దేశం*
*భూగర్భ జలాలకు బదులు శుద్ధి చేసిన వ్యర్థజలాల వినియోగం.. పరిశ్రమలకు TGPCB దిశానిర్దేశం* *హైదరాబాద్, నవంబర్ 4:* రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా శుద్ధి చేసిన పారిశ్రామిక వ్యర్థజలాలను, మురుగునీటిని పారిశ్రామిక అవసరాలకు పునర్వినియోగించుకోవాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) సూచించింది. బేగంపేటలోని TGPCB హైదరాబాద్ జోనల్ కార్యాలయంలో జీడిమెట్ల ఇండస్ట్రీస్ అసోసియేషన్ (JIA) ప్రతినిధులతో అధికారులు సమావేశం నిర్వహించారు. *అధికారుల సూచనలు:* స్థానిక సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీలకు చెందిన మురుగునీటి శుద్ధి ప్లాంట్ల (STPs) ద్వారా శుద్ధి చేసిన గృహ వ్యర్థజలాలను డ్రైనేజీల్లోకి వదలకుండా, పారిశ్రామిక అవసరాలకు వాడుకోవాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. తాగునీటియేతర అవసరాలకు భూగర్భ జలాలు, స్వచ్ఛమైన నీటిపై ఆధారపడటాన్ని తగ్గించాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం పరిశ్రమల ప్రతినిధులు జీడిమెట్ల ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ లిమిటెడ్ (JETL) ఆధ్వర్యంలోని కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్...