*తెలంగాణ గవర్నర్‌ను కలిసిన ఉప్పల శ్రీనివాస్ గుప్త.. కుమారుడి వివాహానికి ఆహ్వానం*


 *తెలంగాణ గవర్నర్‌ను కలిసిన ఉప్పల శ్రీనివాస్ గుప్త.. కుమారుడి వివాహానికి ఆహ్వానం*


*హైదరాబాద్:* తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను TPCC ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త తన కుటుంబ సభ్యులతో మర్యాద పూర్వకంగా కలిశారు.


తన చిన్న కుమారుడు *ఉప్పల సాయి తేజ, వైష్ణవి మోనిగారి* వివాహ వేడుకలకు హాజరుకావాల్సిందిగా గవర్నర్‌ను స్వయంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.


ఈ సందర్భంగా గవర్నర్ ఆత్మీయంగా స్వాగతం పలికి, సాదరంగా ఆహ్వానాన్ని స్వీకరించారు. నూతన వధూవరులకు ముందస్తు శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించారు.


గౌరవ గవర్నర్‌ను వ్యక్తిగతంగా కలిసి తమ కుటుంబంలోని శుభకార్యానికి ఆహ్వానించడం ఎంతో ఆనందంగా, గౌరవంగా భావిస్తున్నామని ఉప్పల శ్రీనివాస్ గుప్త తెలిపారు. గవర్నర్ అందించిన ఆత్మీయ స్వాగతం, శుభాకాంక్షలు తమ కుటుంబానికి ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన అనుభూతిగా నిలిచిపోతాయని ఆయన పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు