*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం* హైద్రాబాద్ : మహాసభ వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. సీనియర్ జర్నలిస్టు భూపతి రాజు దాఖలు చేసిన సమాచార హక్కు (RTI) దరఖాస్తును జిల్లా రిజిస్ట్రార్ తిరస్కరించినప్పటికీ, అప్పీల్ దశలో ఆయనకు న్యాయం లభించింది. అప్పిలేట్ అధికారి అయిన DIG పూర్తి స్థాయిలో విచారణ జరిపి, మహాసభ క్యాష్ బుక్, లెడ్జర్, సభ్యుల జాబితా వంటి కీలక సమాచారాన్ని వెంటనే సేకరించి అందించాలని జిల్లా రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. ‘పబ్లిక్ అథారిటీ’గా మహాసభ – 5 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు కీలకం ఈ కేసులో ఒక ముఖ్య అంశం మహాసభను “పబ్లిక్ అథారిటీ”గా పరిగణించాల్సిన అవసరం. భూపతి రాజు తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వం ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో సుమారు 5 ఎకరాల భూమిని ఉచితంగా మహాసభకు కేటాయించింది. ప్రభుత్వ ఆస్తులు లేదా వనరులు పొందిన సంస్థలు ప్రజల పర్యవేక్షణకు లోబడతాయని, అందువల్ల అవి RTI చట్ట పరిధిలోకి వస్తాయని ఆయన వాదించారు. భూపతి రాజు మాట్లాడుతూ, “ఇది పారదర్శకత కోసం పోరాటంలో తొలి విజయం. గత 11 ఏళ్లుగా మహాసభ నాయకులు ఎలాంటి సర్వసభ్య సమావేశం నిర్వహించలేదు. అలాగే ఆర్థిక లావ...
ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా? హైదరాబాద్: మహాసభలో అక్రమాలు జరుగుతున్నాయని, జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించడం లేదని, సభ్యత్వ రుసుముల వసూళ్లలో దొంగ రసీదు బుక్కుల వ్యవహారం ఉందని ప్రక్షాళన కమిటీ చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. “తస్మాత్ జాగ్రత్త” అంటూ ప్రక్షాళన కమిటీ చేసిన ఆరోపణలపై మహాసభ సంజాయిషీ నోటీసు జారీ చేయడం, ప్రక్షాళన కమిటీ లేవనెత్తిన అంశాలు అధికారికంగా స్పందించాల్సిన స్థాయికి చేరుకున్నాయనే సంకేతంగా భావించవచ్చు. అయితే అసలు ప్రశ్న ఇప్పుడు మొదలైంది. సంజాయిషీ నోటీసుతోనే వ్యవహారాన్ని ముగిస్తారా? లేక ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిజానిజాలను బయటపెడతారా? ముఖ్యంగా సంబంధిత జిల్లా కమిటీని రద్దు చేస్తారా? లేక కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా? అన్నది ఇప్పుడు సామాన్య ఆర్యవైశ్యుడిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. జిల్లా కమిటీపై వచ్చిన ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? ఆరోపణలు నిరాధారమని తేలితే దానిని అధికారికంగా ప్రకటిస్తారా? సభ్యత్వ రుసుముల వసూళ్లు, రసీదు బుక్కుల వ్యవహారంపై పూర్తి లెక్కలు, రికార్డులు బయటపెడతారా? ఇప్పటికే “పొరపాటు జరిగింది” అంటూ బా...
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు హైద్రాబాద్: తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఓటర్ల లిస్టు లో అర్హత లేని వారు నల్లగొండ జిల్లా ఓటర్ల ను తయారు చేశారని అట్టి ఓటర్ లిస్టు చెల్లదని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ, ఎన్నికల కొరకు కోర్టు నియమించిన అడ్వకేటు కమీషనర్ పి. బాల గోపేంద్రనాథ్ కు అభ్యంతరాలు వ్యక్త పరుస్తూ భూపతి రాజు ఫిర్యాదు అందచేశారు. ఆ ఫిర్యాదు లో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు నిర్వహించుటకు తమరిని కోర్టు అడ్వకేటు కమీషనర్ గా నియమించారని ప్రస్తుతము ఉన్న ఓటర్స్టు పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 2026 మార్చి 3.4,5 తేదీలలో తెలపవలసిందిగా కోరుతూ ఈనాడు దిన పత్రికలో పబ్లిక్ నోటీసు ను తమరు ప్రకటించారని, నల్లగొండ ఓటర్ లిస్టు చెల్లదని వివరాలు తెలిపారు. నేను అనగా భూపతి రాజు (తండ్రి భద్రాద్రి) రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ జీవిత సభ్యుడననీ, ( జీవిత సభ్యునిగా నా సభ్యత్వ నంబరు 56924), ప్రస్తుతము జిల్లా ఉపాధ్యక్షులు గా ఉన్నానని , నా అడ్రసు: 6-2-1061/2 , వీటి కాలని, నల్గొండ 508001 . సెల్: 9848490545 ని తమరికి చ...
Comments
Post a Comment