మత్తు ను చిత్తు చేయండి యువత కు "మాచన" పిలుపు


 మత్తు ను చిత్తు చేయండి

యువత కు "మాచన" పిలుపు




గంజాయి,డ్రగ్స్ ..ఇలా వివిధ రూపాల్లో లభించే మత్తు పదార్గాలకు అలవాటు కాకుండా యువత తమ బలహీనత ను చిత్తు చేయాలని టుబాకో కంట్రోల్ హీరో అవార్డు గ్రహీత,పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్. పిలుపునిచ్చారు. డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..

గాంజా చాక్లేట్ ల ను విద్యార్ధుల కు విక్రయించే ముఠా ను పోలీసులు పట్టుకున్న ఉదంతం దరిమిలా..రఘునందన్ మానవీయ కోణంలో స్పందిస్తూ..గాంజా.. మాత్రమే గాక మాదక ద్రవ్యాల నుంచి కూడా రాష్ట్రాన్ని విముక్తి చేయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో ఉన్నారని, ఇది ఓ రకంగా యువత ను ఓ గొప్ప "ఆయుధం"గా.. తమ ను తాము మలచుకునేలా చేస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు.విద్యార్థులు,యువత మత్తు కు లోనై ను నిర్వీర్యం కావటం అవాంఛనీయమన్నారు. ముఖ్యంగా కార్పొరేట్ పాఠాశాల ల్లో చదివే విద్యార్థుల కు అవసరానికి మించి పాకెట్ మనిని వారి తల్లి దండ్రులు ఇవ్వటం కూడా పిల్లలు చెడు అలవాట్ల కు దగ్గర కావడం దోహదపడేలా ఉంటుంది. టీనేజర్స్ సాధారణం గా మత్తు కు బానిస అవుతుంటారు.అందుకే యుక్త వయస్సు లో ఉన్న విద్యార్థుల తల్లి తండ్రులు కవీసం రోజు లేదా అడపా దడపా తమ పిల్లల తో వారి చదువు తీరు,తెన్నుల పై కాసేపు దృష్టి సారించినా..కూడా పరిస్థితి చేయిదాటదన్నారు. పిల్లల కు గారం తో డబ్బు అడిగినంత ఇవ్వడం,అవసరం ఉన్నా లేకున్నా పాకెట్ మని ఉండటం తో నే జల్సా వైపు విద్యార్థులు, యువత ఆకర్షితమవుతోoది.

విద్యార్థుల తల్లి తండ్రులు ఎంత బిజీగా ఉన్నా లేకపోయినా..వీలు కలుగజేసుకుని పాఠాశాల, కళాశాలల ప్రాంతాల్లో నిఘా పెడితే ఇలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా చేయొచ్చు. "పోలీసులు ఏమ్ చేస్తున్నారు ప్రభుత్వం ఏమ్ చేస్తోంది" అని ప్రశ్నించే కంటే.. తాము ఎంత వరకు పిల్లల నడత ,అలవాట్లు వారి దోస్తానా పై నిశిత దృష్టి పెడితే?!

"అమ్మో.. మా పేరెంట్స్ చాటు గా అన్ని గమనిస్తున్నారు" ఆన్న భయం పిల్లల మది లో ఉంటుంది.యుక్త వయసు లో ఉన్న విద్యార్థుల ను కర్కశంగా..కటువుగా మందలించే బదులు..వారితో కాసేపు కూచోని చదువు పై చర్చించడమే గాక స్నేహితంగా మాట్లాడితే.. ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది అంతే గాక అమ్మా నాన్న లు అన్ని తెలుసుకుంటారు మనం జాగ్రత్త గా ఉండాలి ఆన్న విషయం లో భయం భక్తి వాటంతట అవే మది లో పాతుకు పోతాయి. అంతే గాక దోస్తుల ప్రభావం తో ,వారి ప్రోద్బలం వల్ల కలిగే ధూమపానం, గుట్కా వంటి దుర లవాట్లను నియంత్రించవచ్చు.

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముడిదుడ్డి శ్యాంసుందర్