*మెడికల్ బిల్లు కోసం రూ.25 వేలు లంచం.. ఫోన్ పే లో తీసుకున్న సీనియర్ అకౌంటెంట్ ఏసీబీ వలలో*


 *మెడికల్ బిల్లు కోసం రూ.25 వేలు లంచం.. ఫోన్ పే లో తీసుకున్న సీనియర్ అకౌంటెంట్ ఏసీబీ వలలో*


*నాగర్ కర్నూల్, అక్టోబర్ 06:* నాగర్ కర్నూల్ జిల్లాలో ట్రెజరీ అధికారి అవినీతి బయటపడింది. మెడికల్ లీవ్ బిల్లు ప్రాసెస్ చేయడానికి లంచం డిమాండ్ చేసి ఫోన్ పే ద్వారా తీసుకున్న సీనియర్ అకౌంటెంట్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది.


*ఏసీబీ ప్రెస్ నోట్ నెం.151 ప్రకారం..*


*నిందితుడు: శ్రీ కందడ వెంకటయ్య, సీనియర్ అకౌంటెంట్, సబ్ డివిజనల్ ట్రెజరీ ఆఫీస్, అచ్చంపేట, నాగర్ కర్నూల్ జిల్లా.*


ఫిర్యాదుదారుడి మెడికల్ లీవ్ మరియు దానికి సంబంధించిన బిల్లులు/అలవెన్సులు ప్రాసెస్ చేయడానికి అకౌంటెంట్ వెంకటయ్య రూ.25,000 లంచం డిమాండ్ చేశాడు.


ఆగస్టు 14, 2026న ఫిర్యాదుదారుడి నుండి రూ.3,000 నగదుగా తీసుకున్నాడు. మిగిలిన రూ.22,000 లంచాన్ని ఆగస్టు 18, 2026న ఫోన్ పే ద్వారా బదిలీ చేయించుకున్నాడు.


అక్రమ లబ్ధి పొందే ఉద్దేశంతో తన అధికార విధులను సక్రమంగా నిర్వర్తించకుండా నిందితుడు వ్యవహరించాడని ఏసీబీ పేర్కొంది. దీంతో అతనిపై క్రిమినల్ మిస్ కండక్ట్ కింద కేసు నమోదు చేశారు.


నిందితుడిని నాంపల్లిలోని I అదనపు స్పెషల్ జడ్జి ఫర్ SPE & ACB కేసుల కోర్టులో జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?