ఏసీబీ ఉచ్చులో అవినీతి ‘న్యాయ’ రక్షకుడు!

 



"ఏసీబీ ఉచ్చులో అవినీతి ‘న్యాయ’ రక్షకుడు!

రూ. 1.50 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ పెద్దపల్లి పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్
పెద్దపల్లి, గూఢచారి ప్రతినిధి:
న్యాయం చేయాల్సిన స్థానంలో ఉండి, అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవినీతి నిరోధక శాఖ (ACB) వలకు చిక్కాడు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న డొంకెన రవీందర్, రూ. 1.50 లక్షల లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అసలేం జరిగిందంటే..
2023లో ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో జరిగిన ఒక భూ వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, నలుగురు వ్యక్తులపై హత్య కేసు నమోదైంది. అయితే, ఈ కేసులో నిందితులకు అనుకూలంగా వ్యవహరించి, వారికి కోర్టులో లబ్ధి చేకూరుస్తానంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్ రూ. 2 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం.
పక్కా ప్లాన్‌తో ఏసీబీ దాడులు:
అంత పెద్ద మొత్తంలో లంచం ఇచ్చుకోలేని బాధితులు కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి బృందం పక్కా వ్యూహంతో వల పన్నింది. ఒప్పందంలో భాగంగా మొదటి విడతగా రూ. 1.50 లక్షల నగదును రవీందర్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
నిందితుడి వద్ద నుండి నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు, కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు. న్యాయవ్యవస్థలో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారి ఇలా లంచం తీసుకుంటూ పట్టుబడటం పెద్దపల్లి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు