*భవన నిర్మాణానికి రూ.8 లక్షల లంచం డిమాండ్.. రూ.4 లక్షలతో ఏసీబీకి చిక్కిన GHMC అధికారి*
*భవన నిర్మాణానికి రూ.8 లక్షల లంచం డిమాండ్.. రూ.4 లక్షలతో ఏసీబీకి చిక్కిన GHMC అధికారి*
*హైదరాబాద్, అక్టోబర్ 05:* GHMCలో మరో టౌన్ ప్లానింగ్ అధికారి అవినీతి వ్యవహారం బట్టబయలైంది. గోల్కొండ జోన్‌లో భవన నిర్మాణాన్ని అడ్డుపెట్టుకుని లక్షల్లో లంచం డిమాండ్ చేసిన సూపర్‌వైజర్ ఏసీబీ వలలో పడింది.
*ఏసీబీ ప్రెస్ నోట్ నెం.149 ప్రకారం..*
*నిందితురాలు: శ్రీమతి తులసిరాం సునీత, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్, GHMC, గోల్కొండ జోన్, సర్కిల్-33, మెహదీపట్నం, హైదరాబాద్.*
అక్టోబర్ 05, 2026న సిటీ రేంజ్-I ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
*అసలేం జరిగింది?*
ఫిర్యాదుదారుడి భవన నిర్మాణంపై GHMC డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన స్పీకింగ్ ఆర్డర్లను పట్టించుకోకుండా ఉండేందుకు, నిర్మాణాన్ని కొనసాగించేందుకు అనుమతించి, ఇకపై ఎలాంటి వేధింపులకు గురిచేయకుండా సహకరించేందుకు సునీత రూ.8 లక్షలు డిమాండ్ చేసింది.
ఇందులో భాగంగా మొదటి విడతగా రూ.4 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఆమె వద్ద నుండి లంచం సొమ్ము రూ.4 లక్షలతో పాటు, లెక్కల్లో లేని మరో రూ.2.50 లక్షల నగదు కూడా బయటపడింది. రెండు మొత్తాలను అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ లబ్ధి పొందేందుకు అధికారి తన విధులను సక్రమంగా నిర్వర్తించలేదని ఏసీబీ పేర్కొంది.
నిందితురాలిని నాంపల్లిలోని I అదనపు స్పెషల్ జడ్జి ఫర్ SPE & ACB కేసుల కోర్టులో జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హాజరుపరచనున్నారు.

Comments
Post a Comment