*కోరుట్ల RTA ఆఫీసులో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు.. బయటపడ్డ 7 అవకతవకలు*

 *కోరుట్ల RTA ఆఫీసులో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు.. బయటపడ్డ 7 అవకతవకలు*


*జగిత్యాల, అక్టోబర్ 06:* జగిత్యాల జిల్లా కోరుట్లలోని యూనిట్ ఆఫీస్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.


అక్టోబర్ 06, 2026న కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులు కోరుట్ల RTA ఆఫీసులో సర్ ప్రైజ్ చెక్ చేశారు. ఆఫీసు రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, చలానాలు, పెండింగ్ దరఖాస్తులు, మొత్తం కార్యాలయ పనితీరును పరిశీలించారు.


*తనిఖీల్లో బయటపడ్డ అక్రమాలు:*


*1.* MVI లేకుండానే ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ N. గిరీష్ కుమార్ డ్రైవింగ్ టెస్ట్‌లు నిర్వహిస్తూ, వాహనాల రిజిస్ట్రేషన్ చెక్ చేస్తున్నట్లు గుర్తించారు.

*2.* అధికారిక పనుల కోసం ఏజెంట్ల ద్వారా ప్రజల నుండి అదనపు డబ్బు వసూలు చేస్తున్నారు.

*3.* సామాన్య ప్రజలు చేసిన దరఖాస్తుల విషయంలో ఏజెంట్లకు ఆఫీసులోకి పూర్తి స్వేచ్ఛ ఉంది. పని పూర్తయ్యే వరకు RTA సిబ్బందితో వారే డీల్ చేస్తున్నారు.

*4.* రికార్డులు, రిజిస్టర్లను సరిగా నిర్వహించడం లేదు.

*5.* సబార్డినేట్ల పని మరియు కేటాయించిన విధులపై పర్యవేక్షణ లేదు.

*6.* డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించాల్సిన ప్రదేశం రవాణా శాఖ ప్రమాణాలకు అనుగుణంగా లేదు.

*7.* డ్రైవింగ్ ట్రాక్‌లో ఎలాంటి సైన్ బోర్డులు లేవు.


ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని, వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), X (@Telangana ACB) ద్వారా కూడా సంప్రదించవచ్చని ఏసీబీ తెలిపింది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొంది.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు