*CURE ప్రాంతానికి కొత్త ఊపిరి: హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మారుస్తాం - సీఎం రేవంత్*
*CURE ప్రాంతానికి కొత్త ఊపిరి: హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మారుస్తాం - సీఎం రేవంత్* *భవిష్యత్ తరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధ అభివృద్ధి* *పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సీఎం వెల్లడి* *హైదరాబాద్, గూఢచారి:* ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ (CURE) మొత్తంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శనివారం జరిగిన గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆధునీకరణ, నగరీకరణతో సమీప భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం సవివరంగా ఆవిష్కరించారు. *ట్రాఫిక్ ఫ్రీ హైదరాబాద్ లక్ష్యం* పెరుగుతున్న నగరీకరణ వల్ల సమీప భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉ...