నల్లగొండ నారాయణ స్కూల్లో విద్యార్థిపై దాడి అమానుషం: బీజేపీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు
నల్లగొండ నారాయణ స్కూల్లో విద్యార్థిపై దాడి అమానుషం: బీజేపీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు నల్లగొండ: నల్లగొండలోని నారాయణ స్కూల్లో ఒకటో తరగతి విద్యార్థిపై జరిగిన దాడి అత్యంత అమానుషమని బీజేపీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులపై దాడులు చేయడం నారాయణ స్కూల్లో పరిపాటిగా మారిందని ఆరోపించారు. బ్రాండ్ పేరుతో విద్యను వ్యాపారంగా మార్చి, అర్హత లేని వ్యక్తులను అధ్యాపకులుగా నియమిస్తున్నారని, తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు పుస్తకాల కొనుగోలులోనూ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. విద్యార్థులు, తల్లిదండ్రులను బెదిరించే పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. ఒకటో తరగతి విద్యార్థిపై దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని పేర్కొన్న ఆయన, ఈ ఘటనపై సంబంధిత అధికారుల ద్వారా సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, నారాయణ స్కూల్కు సంబంధించిన అనుమతులను తక్షణమే సమీక్షించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే పర్మిషన్లు రద్దు చేయాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘ...