*TGREDCO డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు*
*TGREDCO డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు* *మాదాపూర్ తో పాటు 10కి పైగా ప్రాంతాల్లో ఏకాల తనిఖీలు* *హైదరాబాద్:* తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ - TGREDCO డిప్యూటీ ఇంజనీర్ ముత్యం వెంకటరమణ ఇంట్లో మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు సోదాలు ప్రారంభించారు. మాదాపూర్‌లోని ఆయన నివాసంతో పాటు రాష్ట్రంలోని 10కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. డీఎస్పీ మాజి ఖాన్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. అధికారులు ఇంట్లోని పత్రాలు, బ్యాంక్ లావాదేవీలు, ఆస్తి వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. *- నివేదిక*