*ఓలెక్ట్రా EBITDAలో 18 శాతం వృద్ధి.. రూ.687 కోట్లకు చేరిన ఆదాయం*
*ఓలెక్ట్రా EBITDAలో 18 శాతం వృద్ధి.. రూ.687 కోట్లకు చేరిన ఆదాయం* *హైదరాబాద్, నవంబరు 9:* ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ ఆదాయం 5 శాతం పెరిగి రూ.687.01 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం (EBITDA) 18 శాతం వృద్ధితో రూ.109.89 కోట్లకు చేరింది. పన్నుల అనంతర లాభం (PAT) 5 శాతం పెరిగి రూ.52.12 కోట్లుగా నమోదైంది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ 401 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే సమయంలో 375 వాహనాలు విక్రయించగా, ఈసారి 7 శాతం వృద్ధి సాధించింది. తొలి ఆరు నెలల్లో మొత్తం 759 వాహనాలను డెలివరీ చేసింది. ఓలెక్ట్రా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,750కు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేసింది. 55 నగరాల్లో ప్రజా రవాణా సేవలకు బస్సులను అందిస్తోంది. ఈ వాహనాలు ఇప్పటివరకు 750 మిలియన్లకు పైగా గ్రీన్ కిలోమీటర్లు ప్రయాణించాయి. కంపెనీ వద్ద 8,000కు పైగా ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్లు ఉన్నాయి. నాలుగో త్రైమాసికంలో కొత్త తరం ఎలక్ట్రిక్ బస్సులను మార్కెట్లోకి తీసు...