**బిగ్ బాస్ సీజన్ 13ను నిషేధించాలని కర్ణిసేన కార్యకర్తలు డిమాండ్**

బిగ్ బాస్ సీజన్ 13ను నిషేధించాలని కర్ణిసేన కార్యకర్తలు డిమాండ్


ముంబై:  భారతసంస్కృతికి వ్యతిరేకంగా అభ్యంతరకరంగా ఉన్న బిగ్‌బాస్ సీజన్ 13 షోపై నిషేధం విధించాలని డిమాండ్లు వస్తోన్న విషయం తెలిసిందే. 


ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్, బిగ్ బాస్ షో హోస్ట్ సల్మాన్‌ఖాన్ నివాసం వద్ద పోలీసులు సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. 


 కర్ణిసేన కార్యకర్తలు ముంబైలోని సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు.


ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


బెడ్ ఫ్రెండ్స్ కాన్సెప్ట్‌తో వస్తోన్న బిగ్ బాస్ సీజన్ 13ను నిషేధించాలని కర్ణిసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. 


సీజన్ 13కు తీసుకుంటోన్న ఇతివృత్తం భారత సంస్కృతిని మంటగలిపేలా ఉందని, కర్ణిసేన వర్గంతోపాటు మరికొంత మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముడిదుడ్డి శ్యాంసుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ