*ఆమంచి రాజాలింగము కు ఘన సన్మానం*


 

*ఆమంచి రాజాలింగము కు ఘన సన్మానం*


*నల్గొండ:* ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, నల్గొండ జిల్లా మేనేజింగ్ కమిటీ మెంబర్‌గా ఎన్నికైన కుమ్మర ముద్దుబిడ్డ, తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం (TRKS) రాష్ట్ర కోశాధికారి *ఆమంచి రాజాలింగము* ని మైసూర్ నగర్ కుమ్మరి శాలివాహన సంఘం కమిటీ మర్యాదపూర్వకంగా కలిశారు.


ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి, మొక్కను అందజేసి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.


రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా జిల్లాలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని, సమాజ సేవలో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.


ఈ కార్యక్రమంలో మైసూర్ నగర్ కుమ్మరి శాలివాహన సంఘం అధ్యక్షులు బొడ్డుపల్లి ప్రసాద్, ఉపాధ్యక్షులు కంభంపాటి మహేష్, ప్రధాన కార్యదర్శి ఊట్కూరి సాయి చరణ్, కోశాధికారి ఏరుకొండ హరి, గౌరవ సలహాదారులు సిరిసినవాడ శ్రీనివాస్, కార్యదర్శి ఓరుగంటి గోపాలకృష్ణ, కార్యనిర్వహకులు ఆరూరి శ్రీను, కట్కూరి శ్రీను, సభ్యులు బొడ్డుపల్లి అంజయ్య,యూత్ అధ్యక్షులు కంభంపాటి రాజు, ఉపాధ్యక్షులు ఊట్కూరి శ్రీను నాయకులు, కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు