*కీసర ఇన్‌స్పెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.2.28 కోట్ల అక్రమాస్తులు*


 *కీసర ఇన్‌స్పెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.2.28 కోట్ల అక్రమాస్తులు* 


*మేడ్చల్-మల్కాజిగిరి, అక్టోబర్ 17:* లంచం కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న కీసర ఇన్‌స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులుకు ఏసీబీ మరో షాక్ ఇచ్చింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు *ఏసీబీ ప్రెస్ నోట్ నెం.159* ప్రకారం డీఏ కేసు నమోదు చేసింది.


సిటీ రేంజ్-1 ఏసీబీ అధికారులు అక్టోబర్ 17న ఇన్‌స్పెక్టర్ ఇల్లు, ఆఫీసుతో పాటు బంధువులు, బినామీలకు చెందిన మొత్తం 6 చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు.


*సోదాల్లో గుర్తించిన ఆస్తులు:*


- సరూర్ నగర్ లింగోజిగూడలో రెండు ప్లాట్లు (150 చ.గజాలు చొప్పున) - రూ.30 లక్షలు

- మన్సూరాబాద్ CR ఎన్‌క్లేవ్, ఎల్బీనగర్‌లో 240 గజాల ఇల్లు - రూ.40 లక్షలు

- పేరూర్ గ్రామంలో 180 గజాలలో నిర్మాణంలో ఉన్న ఇల్లు - రూ.50 లక్షలు

- హాలియా, మిర్యాలగూడలో 2 ఎకరాల వ్యవసాయ భూమి - రూ.80 లక్షలు


వీటితో పాటు రూ.7 లక్షల నగదు, 60 తులాల బంగారం, రూ.6.50 లక్షల విటారా బ్రెజ్జా కారు, రూ.10 లక్షల గృహోపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే మొత్తం *రూ.2 కోట్ల 28 లక్షల 50 వేలు* విలువైన ఆస్తులుగా ఏసీబీ అంచనా వేసింది. మార్కెట్ విలువ దీనికంటే చాలా ఎక్కువ ఉంటుందని పేర్కొంది. ఇంకా అదనపు భూములు కూడా ఉన్నట్లు గుర్తించారు.


*జైలులో ఉండగానే మరో కేసు:*


కాగా, ఇదే ఇన్‌స్పెక్టర్ సెప్టెంబర్ 16న రూ.8 లక్షలు డిమాండ్ చేసి తన కింది ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి ద్వారా రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. సెప్టెంబర్ 17న అరెస్టై ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. తాజా అక్రమాస్తుల కేసులో అతడిని పీటీ వారెంట్ పై కోర్టులో హాజరుపరచనున్నారు.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు