Posts

Showing posts from 2021

జియాగూడలో శైవల మత ఆచారాలతో మేకల, గొర్రెల వధ శాలను ఏర్పాటు చేయలి- ధర్మ వేద కటిక్ ట్రస్టీ ప్రముఖ న్యాయవాది కే.ఎన్. సాయి కుమార్ డిమాండ్.

Image
 జియాగూడలో  శైవల మత ఆచారాలతో మేకల, గొర్రెల వధ శాలను ఏర్పాటు చేయలి- ధర్మ వేద కటిక్ ట్రస్టీ ప్రముఖ న్యాయవాది కే.ఎన్. సాయి కుమార్ డిమాండ్. హైదరాబాద్: జియాగూడలో  శైవల మత ఆచారాలతో మేకల, గొర్రెల వధ శాలను ఏర్పాటు చేయలని  ధర్మ వేద కటిక్ ట్రస్టీ ప్రముఖ న్యాయవాది కే.ఎన్. సాయి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఆయన మా ప్రతినిధి తో మాట్లాడుతూ  జియా గూడలో గల ఆసియాలో కెల్ల పెద్ద  మేకల, గొర్రెల  వధశాల వద్ద ప్రత్యేకంగా శైవల మత ఆచారాలతో  వధించుట కోరకు వధశాలను  ఏర్పాటు చేయలని ప్రభుత్వాన్ని కోరామని, హైకోర్టులో కూడా కేసు వేశామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేయకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. హలాల్ చేసిన మాంసాన్ని అల్లాకకు అర్పిస్తారని ఆ మాంసాన్ని ఇతర దేవతలకు అర్పిస్తే ఎంగిలు మాంసాన్ని అర్పించినట్లు అవుతుందని అందుకే శైవల మాత ఆచారము ప్రకారము మేకలను, గొర్రెలను వధించుటకొఱకు ప్రత్యేక వధ శాలను ఏర్పాటుచేయాలని కోరుతున్నామని తెలిపారు.

చర్లపల్లి 16 వ వార్డులో జాతీయ జెండా ఆవిష్కరణ

Image
  చర్లపల్లి 16 వ వార్డులో జాతీయ జెండా ఆవిష్కరణ నల్గొండ: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా చర్లపల్లి 16 వ వార్డులో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో లో బిజెపి రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్ జిల్లా నాయకులు రాపోలు విద్యాసాగర్ బద్దం నగేష్ రాపోలు భాస్కర్ గోని సుధాకర్ నాగేశ్వరరావు సుంకరబోయిన శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు

అయ్యో పాపం ఆ వృద్దురాలు.. చేతిదాక వచ్చిన సొంతిల్లు చేజారిపోయిందా ..?

 అయ్యో పాపం ఆ వృద్దురాలు.. చేతిదాక వచ్చిన సొంతిల్లు చేజారిపోయిందా ..? కొడుకు ఉపాధి మార్గమే కొంప ముంచిందా ..? వృద్దాప్యంలో తల్లిదండ్రులకు నిలువ నీడకలిపించి వారి ఆలన ..పాలన చూడాల్సిన కొడుకు చేసే పని ఆ ముసలి తల్లికి ప్రభుత్వం నుండి అందే ప్రభుత్వ ఫలం అందకుండా ఆమెను నిలువ నీడకు దూరం చేసిన విషయం ఆ ప్రాంతంలో అందరిని కలిచివేసింది. ఆమె చిన్న నాటి నుండి కన్న కల ఒక్కటే సొంత ఇల్లు తండ్రి దండ్రులు వంటపని చేసుకొని జీవనం సాగించే వారు. అనంతర వివాహం జరిగిన తరువాత భర్త కూడా సాదా సీదా ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. అనారోగ్యం సమస్యతో బాదపడుతూ మంచి వైద్యం అందించేందుకు ఆర్దిక స్తోమత లేక మృత్యువాత పడ్డాడు.  ఇద్దరు పిల్లలు ఆడ పిల్లను వారి కుటుంబ పరిస్తితిని అర్దం చేసుకున్న మనసున్న మనిషి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇక అబ్బాయి డిగ్రీ వరకు చదువుకొని కంప్యూటర్‌ నేర్చుకొని ప్రభుత్వం మీసేవ కోసం వేసిన నోటిఫికేషన్‌లో అర్హత సాధించి స్తానికంగా మీసేవ నడుపుకుంటూ వారిరువురు జీవనం సాగిస్తున్నారు. 2019లో ఆమెకు చాతిలో పెద్ద గడ్డకావటంతో హైద్రాబాద్‌లోని కిమ్స్‌కు తీసుకెళితే సుమారు ఒక్కరోజే 30వేల రూపాయల టెస్ట

నల్గొండ ప్రభుత్వ హాస్పటల్లో సమస్యలు వెంటనే పరిష్కరించాలి - బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అయిత రాజు సిద్దు

Image
  నల్గొండ ప్రభుత్వ హాస్పటల్లో  సమస్యలు వెంటనే పరిష్కరించాలి -  బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అయిత రాజు సిద్దు నల్గొండ : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి బీజేవైఎం ఆధ్వర్యంలో సందర్శించి సమస్యలు  పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అయిత రాజు సిద్దు  మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో నల్లగొండలోని ప్రైవేట్ హాస్పిటల్ లో అధిక ఫీజుల దోపిడీ కి పాలు పడుతూ ఉంటే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం అరకొర సౌకర్యాలతో పేద మధ్యతరగతి ప్రజలకు అనేక సమస్యల తో స్వాగతం పలుకుతున్నదిని ఆయన అన్నారు.  ప్రభుత్వ హాస్పిటల్  సిబ్బంది  ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకొని  ప్రభుత్వ హాస్పిటల్ ను పట్టించుకోవడం లేదని,   ఎన్ని సమస్యలు ఉన్న ప్రభుత్వ అధికారులు  పట్టించుకోకుండా ప్రైవేట్ హాస్పిటల్ కు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఈ సమస్యల పైన జిల్లా అధికారులు పట్టించుకోకపోతే బీజేవైఎం ఆధ్వర్యంలో లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో లో బీజేవైఎం రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ముంత సైదులు, జిల్లా ప్రధాన కార్యదర్శి మానుక వెంకటరెడ్డి జిల

బిసీ క‌మిష‌న్‌లో మైనార్టీలకు చోటేది? : సీఎం కేసీఆర్‌పై మండిప‌డ్డ ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి డా. దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్‌

Image
  బిసీ క‌మిష‌న్‌లో మైనార్టీలకు చోటేది? : సీఎం కేసీఆర్‌పై మండిప‌డ్డ ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి డా. దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్‌. ముస్లిం మైనార్టీలు బిర్యానీ, షేర్వానీ, ఖుర్బానీల‌కే  ప‌నికోస్తారా ? గ‌త ఏడేళ్లుగా మోస‌పోతున్న ముస్లిం మైనార్టీల‌కు మ‌రోసారి దొక ఇచ్చిన సీఎం కేసీఆర్‌ హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 24:  బిసీ క‌మిష‌న్‌లో ముస్లిం మైనార్టీల‌కు చోటు క‌ల్పించ‌క‌పోవ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి డా. దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్‌.  తెరాస స‌ర్కార్ వ‌చ్చిన‌ప్ప‌టి నుండి మైనార్టీల‌కు స‌ముచిత స్థానం వ‌స్తుంద‌ని ఆశించిన మైనార్టీల‌కు మ‌రోసారి అన్యాయం చేశార‌ని మండిప‌డ్డారు. సీఎం కేసీఆర్‌ని న‌మ్ముకున్న వారికి దోకా మీద దోకా ఇస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీన్ని ప్ర‌తి ఒక్క ముస్లిం సోద‌రి, సోద‌రీమ‌ణులు ఆలోచించాల్సిన విష‌య‌మ‌న్నారు.  " 240 జీవో జారీ చేస్తూ... బిసీ క‌మిష‌న్ ఛైర్మ‌న్‌గా తెరాస నాయ‌కులు వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్, స‌భ్యులుగా ఉపేంద్ర‌, శుభ‌ప్ర‌ద్ ప‌టేల్‌, కిషోర్‌గౌడ్‌ల‌ను నియ‌మించారు. ఇప్ప‌టికైన పున‌రుద్ద‌రించినందుకు స్వాగ‌తిస్తున్నాం. అయితే బిసి క‌మిష‌న్‌లో మైనార్టీ వ‌ర్గాల సంబం

తెలంగాణ తాలిబన్లలాగా మారిన టీఆర్ఎస్

Image
తెలంగాణ తాలిబన్లలాగా మారిన టీఆర్ఎస్ అప్గానిస్తాన్ని తాలిబన్లు నాశనం చేసినట్టు, కేసీఆర్ సేన తెలంగాణను  చేరబట్టింది - ఏఐసీసీ అధికార ప్రతినిది దాసోజు శ్రవణ్h 👉  సీఎం కేసీఆర్ తాలిబన్ల‌ మాదిరిగా ప్రభుత్వ వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నారు :ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు 👉 కేసీఆర్ దళిత బంధుతో మోసం చేస్తున్నారు, హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాత దళిత బంధు ఉండదు.  👉 హుజురాబాద్‌లో ప్రభుత్వ సమావేశమా.. పార్టీ సమావేశమా..? ప్రభుత్వ సమావేశం అయితే,పాడి కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎందుకు ఉన్నారు? 👉 సీఎస్ సోమేశ్ కుమార్ చిల్లరగా వ్యవహరిస్తున్నారు  👉 7 ఏళ్లలో సీఎంగా కేసీఆర్ ఏ ఒక్క రోజు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేయలేదు. 👉  మొట్టమొదటి సారిగా ఏడేళ్లలో ప్రగతి భవన్ లోకి దళిత ఐఏఎస్ కు అడుగుపెడుతున్నారు. ఏడేళ్లలో దళితులకు లక్షా 25 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా చేయలేదు. ఏడేళ్లలో దళితులకు వాటాగా రావాల్సిన నిధులలో 65 శాతం పక్కదారి పట్టించారు. హైదరాబాద్, ఆగస్టు 17: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అప్గానిస్తాన్ తాలిబన్లాగా మారారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ సీని

నల్గొండ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిగా భూపతి రాజు

Image
 నల్గొండ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిగా  భూపతి రాజు నల్గొండ : నల్గొండ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి గా నల్గొండ పట్టణాన వాసి సీనియర్ కార్యకర్త    భూపతి రాజును బీజేపీ జిల్లా అధ్యక్షులు  కంకణాల శ్రీధర్ రెడ్డి నియమించారు. పార్టీ నియమనిబంధనలకు కట్టుబడి పార్టీ అభివృద్ధి కి  తోడ్పడాలని ఆయన కోరారు. తన ను  నియమించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ కంకణాల శ్రీధర్ రెడ్డి గారికి మరియు  నియమానికి సహకరించిన నాయకులకు  భూపతి రాజు కృతజ్ఞతలు తెలుపుతు,  పార్టీ నియమ నిబంధనలు పాటిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని  అన్నారు.  

రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ జన్మదిన సందర్భంగా పండ్ల పంపిణీ

Image
 రాష్ట్ర బీజేపీ  అధ్యక్షులు బండి సంజయ్ జన్మదిన సందర్భంగా  పండ్ల పంపిణీ నల్గొండ: తెలంగాణ రాష్ట్ర బీజేపీ  అధ్యక్షులు బండి సంజయ్ జన్మదిన సందర్భంగా ఈ రోజు నల్లగొండ జిల్లా మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో రాష్ట్ర మైనార్టీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ పాషా ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ చేసిన జిల్లా మైనారిటీ మోర్చా ప్రధాన కార్యదర్శి సయ్యద్ అబ్రార, జిల్లా కార్యదర్శి అజీజ్ మరియు రెహమాన్, షరీఫ్ ఇతర నాయకు పాల్గొన్నారు

పేదల సొంతింటి కల సాకారం చేసిన వైయస్ జగన్ ప్రభుత్వం : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

Image
  పేదల సొంతింటి కల సాకారం చేసిన వైయస్ జగన్ ప్రభుత్వం : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  *జగనన్న లేఅవుట్ లలో సకల సౌకర్యాలు ,వసతుల ఏర్పాట్లు ..* *మెగా గ్రౌండింగ్ హౌసింగ్ మేళాలో భాగంగా టీడ్కో లే అవుట్ లో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా"జగన్ మోహన్ రావు  నందిగామ : నందిగామ పట్టణంలోని హనుమంతుపాలెం టీడ్కో లే అవుట్ లోని వైయస్సార్ జగనన్న కాలనీలో మెగా గ్రౌండ్ హౌసింగ్ మేళాలో భాగంగా జగనన్న ఇళ్ల నిర్మాణాలకు శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  శనివారం సామూహిక శంకుస్థాపనలు నిర్వహించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా"జగన్ మోహన్ రావు  మాట్లాడుతూ జగనన్న లేఅవుట్లలో సకల సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నామన్నారు ,గత ప్రభుత్వాలు కనీసం ఆలోచన కూడా చేయని నిరుపేదల సొంతింటి కలను అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాకారం చేస్తున్నారని తెలిపారు , అదేవిధంగా నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని చెప్పారు ,గత ప్రభుత్వ హయాంలో ఒక్క నిరుపేద కూడా సెంటు స్థలం మంజ

*ABVP ఆధ్వర్యంలో పరిషత్ పాఠశాల*

Image
 *ABVP ఆధ్వర్యంలో పరిషత్ పాఠశాల* నేడు నల్గొండ నగరంలోని స్థానిక బోయవాడ లో గల ఏచూరి శ్రీనివాస్ స్మారక భవనం ఏబీవీపీ కార్యాలయంలో  కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో నిరుపేద విద్యార్థులు విద్యకు దూరం కాకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల వద్దకే విద్య వెళ్లాలి అనే ఉద్దేశంతో పరిషత్ పాఠశాల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు  తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబీవీపీ ఫర్ సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్ లో భాగంగా కరోనా కారణంగా పాఠశాలలు మూతపడి పేదరికం వల్ల ఆన్లైన్ క్లాసులు వినలేక తీవ్ర ఇబ్బందులు పడుతు విద్యకు దూరం అవుతున్న విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు గ్రామ గ్రామాన,వాడల్లో, బస్తీల్లో,కాలనీల్లో *పరిషత్ పాఠశాల* అనే పేరుతో కార్యక్రమం నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవుల సంపత్ కుమార్, ఎన్జి కళాశాల ఉపాధ్యక్షుడు భానోత్ నాగేందర్, బాలాజీ, ప్రవీణ్,రమేష్ బాల్థాక్రే, నరేష్, పాల్గొన్నారు.

బిజెపి... బిజినెస్ జనతా పార్టీగా మారి ప్రజల రక్తం తాగుతుంది-డా. దాసోజు శ్రవణ్

Image
 బిజెపి... బిజినెస్ జనతా పార్టీగా మారి ప్రజల రక్తం తాగుతుంది-డా. దాసోజు శ్రవణ్ వ్యాపారాన్ని పక్కన పెట్టి కష్ట కాలంలో వున్న ప్రజలని ఆదుకోండి : హైదరాబాద్ : కరోనా కష్ట కాలంలోనూ మోడీ సర్కార్ పెట్రోల్, డీజల్ ధరలు విపరీతంగా పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నదని, వ్యాపారాన్ని పక్కన పెట్టి కష్ట కాలంలో వున్న ప్రజలని ఆదుకోవాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు .   ఏఐసీసీ ఆదేశాల మేరకు, పెరిగిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా హైదరాబాద్ లోని అన్ని పెట్రోల్ బంకుల వద్ద కోవిడ్ గైడ్ లైన్స్ పాటిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో బాగంగా ''ప్రజల చెవిలో పువ్వుపెట్టిన ప్రధాని'' అంటూ మోడీ మాస్కులు ధరించి చెవిలో పువ్వులు పెడుతూ వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజల రక్తమాంసన్ని జలగల్లా పిల్చేసే రీతిలో మోడీ పాలన ఉందని, ప్రజలని లూటీ చేయడమే మోడీ సర్కార్ అజెండాయని ఆయన విమర్శించారు. క్రూడాయిల్ ధర తగ్గుతుంటే సేల్స్ ట్యాక్స్ పెంచేస్తున్నారు. ఎలాగైనా ప్రజలని దోచుకోవాలనేదే మోడీ సర్కార్  ప్లాన్ గా ఉందని అన్నారు. గత

ఎబివిపి ఫర్ సొసైటీ పేరుతో ఏబీవీపీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం- నల్గొండ డి.ఎస్.పి వెంకటేశ్వర్ రెడ్డి

Image
 ఎబివిపి ఫర్ సొసైటీ పేరుతో ఏబీవీపీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం- నల్గొండ డి.ఎస్.పి వెంకటేశ్వర్ రెడ్డి   నల్గొండ :  నగరంలోని స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం ఆసుపత్రికి వచ్చే నిరుపేదలకు  ఏబీవీపీ ఫర్ సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్  రెండవ రోజులో భాగంగా  200 మందికి భోజన వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి నల్గొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి  కార్యక్రమాన్ని ప్రారంభించి ఏబీవీపీ ఫర్ సొసైటీ పేరుతో ఏబీవీపీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, యువత ఇలాగే పెద్ద ఎత్తున ముందుకు వచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అదేవిధంగా ఏబీవీపీ నల్గొండ జిల్లా ప్రముఖ్ కత్తుల ప్రమోద్ కుమార్ గారు మాట్లాడుతూ ఏబీవీపీ ఫర్ సొసైటీ అనే పేరుతో రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జూన్ 10వ తేదీ నుండి 15 తేదీ వరకు వివిధ సేవా కార్యక్రమాలు పేదలకు భోజన వితరణ,కరోనా పై అవగాహన కార్యక్రమాలు, మొక్కలు నాటడం,మాస్కులు పంపిణీ , వాడల్లో శానిటేషన్ చేయడం, అలాగే కరోనా కారణంగా పాఠశాలలకు దూరమైన పేద విద్యార్థులకు పరిషత్ పాఠశాల పేరుతో తరగతులు ని

ఎబివిపి నల్గొండ విభాగ్ ఆధ్వర్యంలో ఎబివిపి ఫర్ సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్

Image
 ఎబివిపి  నల్గొండ విభాగ్ ఆధ్వర్యంలో ఎబివిపి ఫర్ సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్   అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో జూన్ 10 నుండి 15 వ తేదీ వరకు ఎబివిపి ఫర్ సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు అండగా నిలిచేందుకు విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసి ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జూన్ 10 నుండి 15 వరకు ఎబివిపి ఫర్ సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్ పేరుతో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల నుండి మారుమూల గ్రామాలు, గిరిజన తండాల వరకు పెద్ద ఎత్తున 150 స్థలాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నమని తెలిపారు.  వ్యాక్సినేషన్ ప్రక్రియ మీద ఉన్న అపోహలను తొలగించి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునే విధంగా అవగాహన కల్పించడం, కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన అనాధలై

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి

Image
  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి   నల్గొండ : కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి  సందర్శించారు. ఈ సందర్బగంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యాన్ని రెండు మాసాలు పూర్తయినప్పటికీ కూడా ప్రభుత్వం ,మరియు అధికారుల నిర్లక్ష్యం వలన మరియు ముందుచూపు లేని కారణంగా  కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దై మొలకలేత్తినవని, రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవడంలో విసిగివేసారిపోతున్నారని,   వెంటనే చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుందని తెలిపారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఐకేపీ కేంద్రాల్లో నిల్వఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, రైతులు విక్రయించిన వరి ధాన్యానికి వెంటనే డబ్బులను వారి ఖాతాల్లో జమచేయాలని. అధికారులు  లారీలకొరత లేకుండా చూడాలని మరియు మిల్లుల వద్ద  ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేయాలని తాలు పేరుతో ధాన్యంలో కోత విధించారాదని  ఆయన  ప్రభుతాన్ని డిమాం

ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళసూత్రం, మెట్టెలు, విరాళం

Image
  ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో  మంగళసూత్రం, మెట్టెలు,  విరాళం     హైదరాబాద్ లోని వారి నివాసంలో వచ్చి కలిసిన పెళ్లికూతురు బంధువులకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా సతీమణి, ఉప్పల ఫౌండేషన్ కో-ఛైర్ పర్సన్ ఉప్పల స్వప్న  చేతుల మీదుగా మంగళ సూత్రం, మెట్టెలు, చీర,గాజులు విరాళంగా పెళ్లి కూతురు కి ఇచ్చారు.  పేద కుటుంబానికి చెందిన అనాధ మహిళ, వివాహం కోసం మంగళ సూత్రం, మెట్టెలు, చీర,గాజులు విరాళంగా ఇచ్చారు.. మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ అంబేద్కర్ కాలనీ కి చెందిన అనిగళ్ల స్వరూప- మల్లేష్ ల కూతురు వివాహానికి విరాళంగా ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్ధికంగా వెనుకబడిన, తల్లిదండ్రులు లేని అనాథ మహిళ వివాహన్నీ గుర్తించి, పేదింటి అమ్మాయిని ఆదుకోవాలని సహాయం చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు 

జర్నలిస్టులందరూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగపర్చుకోవాలి - తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

Image
 జర్నలిస్టులందరూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగపర్చుకోవాలి -  తెలంగాణ  రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్ : జర్నలిస్టులందరూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగపర్చుకోవాలని తెలంగాణ  రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ ద్వారా ఈ నెల 28, 29వ తేదీలలో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గుర్తించి వ్యాక్సినేషన్ కేంద్రాలుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్, మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, చార్మినార్ యూనాని ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ లను జర్నలిస్టులకు ప్రత్యేక కేంద్రాలుగా కేటాయించినట్లు ఆయన తెలిపారు. అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టుతోపాటు అక్రిడిటేషన్ లేని జర్నలిస్టులందరూ తమ సంస్థ యొక్క గుర్తింపు కార్డులను వ్యాక్సినేషన్ కేంద్రాలలో నమోదు చేసుకొని టీకాలు తీసుకోవాలని కోరారు.  రాష్ట్రంలో దాదాపు 20 వేల మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డులు కలిగి ఉన్నారని, వారితోపాటు అక్రిడిటేషన్ లేని జర్నలిస్టులు కూడా టీకాలు తప్పని సరిగా తీసుకోవాలని ఆయన తెలిపారు. జిల్లా, మండలస్థాయిలో కూడా జర్నలిస్టులకు టీకాలు ఇస్తున్నార

*కాచం ఫౌండేషన్ సేవలు అభినందనీయం : డిఎస్పీ*

Image
 *కాచం ఫౌండేషన్ సేవలు అభినందనీయం : డిఎస్పీ* - - కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసులకు భోజన వితరణ నల్లగొండ : లాక్ డౌన్ నేపద్యంలో కాచం ఫౌండేషన్ సేవలు అభినందనీయమని నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలో లాక్ డౌన్ కారణంగా రోడ్లపై విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజన వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ సిబ్బందికి భోజనం అందించారు. అనంతరం మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా రోడ్లపై విధులు నిర్వహిస్తున్న పోలీసులు భోజన సమయంలో ఇంటికి వెళ్లి తిరిగి రావడం, ఇతర ప్రాంతాల నుండి వచ్చి విధులు నిర్వహిస్తున్న వారికి ఇబ్బందిగా ఉన్న తరుణంలో కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనం అందించడం ఎంతో అభినందనీయమన్నారు. పోలీసులు లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేయడం కోసం ఇంటికి దూరంగా ఉంటూ ప్రజల కోసం.పని చేస్తున్నారని, ఇలాంటి తరుణంలో ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి రావాలని, అనవసరంగా బయటికి వచ్చి ఇబ్బందులు పడవద్దని కోరారు. ప్రజల కోసం నిరంతరం పని చేస్తున్న తమతో ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవాధీనమ్, కాచం ఫౌండేషన్ ప్రతినిధులు

*టప్పర్ వేర్ పేరుతో మోసాలకు పాల్పడ్డ స్వాతి, పార్వతిలపై పిడి యాక్ట్*

 *టప్పర్ వేర్ పేరుతో మోసాలకు పాల్పడ్డ స్వాతి, పార్వతిలపై పిడి యాక్ట్* నల్లగొండ : పట్టణంలోని శివాజీ నగర్ కు చెందిన స్వాతి టప్పర్ వేర్ ప్లాస్టిక్ ఉత్పత్తుల పేరుతో కోట్ల రూపాయలను పలువురి నుండి తీసుకొని వారిని మోసం చేసిన స్వాతి, ఆమెకు సహకరించిన పార్వతి లపై పిడి యాక్ట్ నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు టూ టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నల్లగొండ పట్టణంలోని శివాజీ నగర్ తో పాటు పలు ప్రాంతాలకు చెందిన వారిని మోసం చేసి అధిక లాభాలు చూపిస్తానని చెప్పి మోసం చేయడంతో బాధితులు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ ను సంప్రదించగా కేసు నమోదు చేసి నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి నేతృత్వంలో విచారణ చేసి పిడి యాక్ట్ నమోదు చేసి టూ టౌన్ ఎస్.ఐ. నర్సింహులు గురువారం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.

*కోవిడ్ ఎమెర్జెన్సీ పేరుతో సైబర్ నేరగాళ్ల నయా మోసం..*

*కోవిడ్ ఎమెర్జెన్సీ పేరుతో సైబర్ నేరగాళ్ల నయా మోసం..* *నకిలీ ఈమెయిల్ ద్వారా 23 లక్షలు కాజేసిన కేటుగాళ్ళు..* హైదరాబాద్ కి చెందిన వీరేంద్ర బండారి అనే వ్యాపారి పేరుతో నకిలీ ఈమెయిల్ క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లు. తాను కోవిడ్ పొజిటీవ్ తో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నానని.. అర్జెంట్ గా పేరుతో 23 లక్షల 60 వేల రూపాయలు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలని నకిలీ ఈమెయిల్ ద్వారా మెయిల్ చేసిన కేటుగాళ్ళు   తమ ప్రమేయం లేకుండానే నకిలీ  లెటర్ ప్యాడ్ పై తన సంతకాన్ని ఫోర్జరీ చేసి.. బేగంపేట యాక్సిస్ బ్యాంక్  మెయిల్ చేసిన.. సైబర్ నేరగాళ్లు. సంతకం టాలీ అవడంతో వారు చెప్పిన మూడు అకౌంట్లకు 23 లక్షలు 60 వేల నగదు ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంకు అధికారులు.  సాయంత్రం అకౌంట్ చెక్ చేసి డబ్బులు తక్కువ ఉండడంతో..తన సంతకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యాపారి వీరేంద్ర బండారి.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.  *ఇదే తరహాలో మరో మోసం..* *తాను హాస్పటల్ లో ఉన్నాను అని తన అకౌంట్ నుండి 5 లక్షల రూపాయలు అర్జెంటుగా బదిలీ చేయాలని నకిలీ లెటర్ పై సంతకం చే

నిషేధిత గుట్కాలు పట్టివేత

 నల్గొండ.... నల్గొండ పట్టణంలోని ఓల్డ్ కలెక్టరేట్ రోడ్ లో శ్రీ లక్ష్మీ ప్రసన్న ట్రేడర్స్ లో నిషేధిత గుట్కా లు అమ్ముతున్నారనే సమాచారంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో తనికీలు...నిషేధిత నికోటిన్, గుట్కా ప్యాకేట్ల పట్టివేత..కేసు నమోదు

కరోనా చికిత్స కు 500 ఆక్సిజన్ బెడ్స్ పెంచాలని జిల్లా కలెక్టరు కు ఆన్లైన్ లో వినతి పంపిన సిపిఎం

Image
కరోనా చికిత్స కు 500 ఆక్సిజన్ బెడ్స్  పెంచాలని జిల్లా కలెక్టరు కు ఆన్లైన్ లో వినతి    పంపారు యధావిధిగా చదవండి                           *శ్రీయుత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ నల్లగొండ గారికి*          *విషయం* :- *(1) కరోనా చికిత్స కు 500 ఆక్సిజన్ బెడ్స్  పెంచుట.*                                                                    *(2)వెంటీలేటర్ బెడ్స్ 100కి పెంచుట,రిపేరులో వున్నవాటికి అవసరమైన మెటీరియల్ తెప్పించుట.*                                  *(౩) కరోన వార్డుల్లో సి.సి కెమారాలు అమర్చుట*                                                                               *( 4) జిల్లా కేంద్రం ఆసుపత్రిలో కరోన టెస్టులు 50 మాత్రమే చేస్తున్నారు,రోజుకి 300 కు పెంచుట మరియు phc ల లో 25 మాత్రమే చేస్తున్నారు 100 వరకు పెంచుట గురించి.*                                     *(5) ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేకుండా ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఇప్పించుట గురించి.*                                     *(6) ప్రతిరోజు కరోన చికిత్సా పైనా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించీ తగు సుాచనలు చేయుట మరియు అవసరమైన నిధులు కేటాయించి వస

కోవిడ్ బులిటీన్ మే 8

Image
 కోవిడ్ బులిటీన్ మే 8

*కోవిడ్ చికిత్సకుఅందుబాటులోకి కొత్త డ్రగ్*. కీలక ప్రకటన చేసిన భారత రక్షణ శాఖ.

 *Delhi* *కోవిడ్ చికిత్సకుఅందుబాటులోకి కొత్త డ్రగ్*. కీలక ప్రకటన చేసిన భారత రక్షణ శాఖ. *DRDO మరియు Dr Reddy's  laboratories సంయుక్త ఆధ్వర్యంలో 2DG పేరుతో అందుబాటులోకి కొత్త డ్రగ్.* కోవిడ్ లక్షణాలతో హాస్పిటల్లో చికిత్సపొందుతున్న *రోగులను రెండింతల వేగంతో నయం చేస్తున్న 2-deoxy-D-glucose గా పిలువబడే కొత్త డ్రగ్.* *రోగుల ఆక్సిజన్ అవసరాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తున్న 2DG డ్రగ్.* పౌడర్ రూపంలో లభించే ఈ 2DG డ్రగ్ ను  నీళ్లలో కలుపుకుని తాగవచ్చని రక్షణ శాఖ ప్రకటన. *వైరస్ ద్వారా ప్రభావితమైన కణాల్లో ఈ కొత్త డ్రగ్ చేరి వైరస్ వృద్ధిని నిరోధిస్తుందని ప్రకటించిన కేంద్ర రక్షణ శాఖ*. *కేవలం వైరస్ సోకిన క్షణాల్లో మాత్రమె చేరడం ఈ కొత్త డ్రగ్ ప్రత్యేకత అని ప్రకటించిన కేంద్ర రక్షణ శాఖ.* *COVID వ్యతిరేక పోరాటంలో మరో హైదరాబాదీ ఫార్మా కంపెనీ కీలక భాగస్వామ్యం.* DRDO తో కలిసి సంయుక్త పరిశోధన చేసి 2DG డ్రగ్ ను ఆవిష్కరించిన   హైదరాబాద్ కు చెందిన Dr. Reddy's లబోరేటరీస్.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా , జిల్లాల వారిగా , పట్టణాల వారిగా , ఆక్సిజన్ బెడ్ ,వెంటి లెటర్ బెడ్ ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో ఈ లింకు ద్వారా తెలుసుకోవచ్చు...*

 *తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా , జిల్లాల వారిగా , పట్టణాల వారిగా , ఆక్సిజన్ బెడ్ ,వెంటి లెటర్  బెడ్ ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో ఈ లింకు ద్వారా తెలుసుకోవచ్చు. https://covidtelangana.com

*ప్రతి ఆసుపత్రిలో చార్జీల వివరాలు ఏర్పాటు చేయాలి : డిఐజి రంగనాధ్*

Image
  *ప్రతి ఆసుపత్రిలో చార్జీల వివరాలు ఏర్పాటు చేయాలి : డిఐజి రంగనాధ్* - - విపత్కర సమయంలో ఆసుపత్రుల యజమాన్యాలు మానవత్వంతో వ్యవహరించాలి - - ధరల పట్టిక ఏర్పాటు చేయకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం - - కష్టకాలంలో  పేదలు, సామాన్యులకు మెరుగైన వైద్యం అందించాలి - - మందులు, ఆక్సిజన్ కోసం అధిక డబ్బులు వసూలు చేస్తే కేసులు నల్లగొండ : కరోనా విపత్కర సమయంలో డాక్టర్లు అందిస్తున్న సేవలు అద్వితీయమని, అదే సమయంలో స్కానింగ్ సెంటర్లు, ఆసుపత్రుల యాజమాన్యాలు మానవతా హృదయంతో కరోనా రోగులకు సేవలందించాలని డిఐజి ఏ.వి. రంగనాధ్ కోరారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా కరోనా రెండో దశ వేగంగా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు. కరోనా సోకిన వారు ధైర్యాన్ని కోల్పోకుండా హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ ఆత్మస్థైర్యంతో సరైన రీతిలో మందులు, ఆహారం తీసుకుని కరోనాను జయించాలని సూచించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులలో కొన్ని ఆసుపత్రుల్లో అత్యధికంగా డబ్బులు వసూలు చేస్తుండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఆస్పత్రులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం

తప్పిన పెనుప్రమాదం ,,,సకాలంలో ఆక్సిజన్ అందించి 400 మంది ప్రాణాలను కాపాడిన ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు*

Image
  *తప్పిన పెనుప్రమాదం ,,,సకాలంలో ఆక్సిజన్ అందించి  400 మంది ప్రాణాలను కాపాడిన ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు* *విజయవాడ GGHలో ఆక్సిజన్ తో చికిత్సపొందుతున్న సుమారు నాలుగు వందలకు మంది కోవిడ్ భాదితులు* *18టన్నుల తో వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రాకింగ్ వ్యవస్థ తో తెగిపోయిన సంబంధాలు* *విజయవాడ సిటీ కమిషనర్ కి సమాచారాన్ని చేరవేసిన సంబంధిత అధికారులు* *హుటాహుటిన రంగంలోకి దిగిన విజయవాడ సి.పి ఒరిస్సా నుండి విజయవాడ వరకు ఉన్న అన్ని  మార్గ మధ్యలో ఉన్న జిల్లా ఎస్పీలను అప్రమత్తం చేసిన సి‌పి* *ఈస్ట్ గోదావరి జిల్లా, ధర్మవరం వద్ద ఓ డాబా లో ఆక్సిజన్ ట్యాంకర్ ని గుర్తించిన ప్రత్తిపాడు పోలీసులు* *నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా లో నిమగ్నం అవడంతో అలసిపోయి వాహనాన్ని నిలిపి వేసినట్టుగా పత్తిపాడు సిఐ కి డ్రైవర్ వివరించాడు* *డ్రైవర్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళిన  ప్రత్తిపాడు సిఐ...అధికారుల ఆదేశాలతో ఆక్సిజన్ ట్యాంకర్ కు గ్రీన్ చానల్ ఏర్పాటు* *డ్రైవర్ కి తోడుగా అనుభవం కలిగిన హోంగార్డుతో ఆక్సిజన్ ట్యాంకర్ ను గ్రీన్ ఛానల్ ద్వారా సురక్షితంగా విజయవాడ జి.జి.హెచ్ కి  చేర్చిన పోలీసులు*

బెంగాల్ లో బిజెపి కార్యకర్తల పై జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్య వాదులు ఖండించా

Image
  *బెంగాల్ లో బిజెపి కార్యకర్తల పై జరుగుతున్న దాడులను* ప్రజాస్వామ్య వాదులు అందరూ కూడా ఖండించాలని నల్గొండ బిజెపి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జి లు ధరించి నిరసన తెలపడం జరిగింది.. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ , బీజేపీ పట్టణ అధ్యక్షులు మొరిశెట్టి నాగేశ్వరరావు గారు, పోతెపాక సాంబయ్య గారు, అసెంబ్లీ కన్వీనర్ కంకణాల నాగిరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్, కుమ్మరికుంట్ల సాయి కుమార్, పంజాల యాదగిరి, వట్టికోటి దుర్గ, టంగుటూరి శ్యామ్, పోకల దశరథ, సాయి, నరేందర్ గార్లు  తదితరులు పాల్గొన్నారు..

Mamata Banerjee took oath as chief minister of Bengal

Image
 Trinamool Congress chief Mamata Banerjee took oath as chief minister of Bengal for the third time today. On Monday, she had met governor Jagdeep Dhankhar to stake claim to form the next government. Banerjee said the event itself would be a low-key affair, because of the pandemic.

ప్రైవేట్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ పై తెలంగాణ వైద్య శాఖ గైడ్ లైన్స్

 ప్రైవేట్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ పై తెలంగాణ వైద్య శాఖ గైడ్ లైన్స్  వ్యాక్సినేషన్ కు  ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి  ఇచ్చిన వైద్యశాఖ  45 ఏళ్ళ పైబడి, కోవిన్ సాఫ్ట్వేర్ లో స్లాట్ బుక్ చేసుకున్న వాళ్లకు మాత్రమే వాక్సిన్ వెయ్యాలి..  *ప్రైవేట్ సెంటర్లు  వ్యాక్సిన్ ను సొంతంగా తయారీ కంపెనీల నుంచి కొనుక్కోవాల్సి ఉంటుంది

*జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తిస్తున్నాం* కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడి

Image
  *జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తిస్తున్నాం*   కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడి న్యూడిల్లీ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఆందోళన కల్గిస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ నియంత్రణ ఛాయలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ కోరారు. జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఆయా రాష్ట్రాలు అప్రమత్తత పాటిస్తూ నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా క్రీయాశీలక కేసులు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, అసోం, బీహార్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిబెంగాల్‌లో తాజాగా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 22 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 15 శాతంగా ఉందని వెల్లడించారు. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో కరోనా మూడో విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభమైందని, 18 – 44 వయస్సు ఉన్న 20 లక్షల మందికి టీకాలు అందాయని పేర్కొన్నారు.

*రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేసిన సీఎం కేసీఆర్*

Image
 *రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేసిన సీఎం కేసీఆర్*

ఇంకా లక్ష రూపాయలు కడితేనే డెడ్ బాడీ ని ఇస్తామంటున్న ఆసుపత్రి యాజమాన్యం

 For info... నల్గొండ.... నకిరేకల్ ప్రాంతానికి చెందిన కొండ శ్రీకాంత్ (29).కరోనా తో నల్గొండ పట్టణంలోని మాక్స్ వెల్త్ ఆసుపత్రిలో మృతి...ఇప్పటికే 140000  రూపాయలు ఆసుపత్రికి ఇచ్చిన పేరెంట్స్.. ఇంకా లక్ష రూపాయలు కడితేనే డెడ్ బాడీ ని ఇస్తామంటున్న ఆసుపత్రి యాజమాన్యం 50 వేలు కట్టడానికి సిద్ధంగా ఉన్న బంధువులు నకిరేకల్ ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్పినా వినని ఆసుపత్రి యాజమాన్యం ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బంధువులు మృతినికి  చిన్న బాబు ఎలాగైనా డెడ్ బాడీ ఇప్పించండి అంటూ ఆసుపత్రిని వేడుకుంటున్న వినడం లేదంటున్నారు

మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు - అద నపు కలెక్టర్ రాహుల్ శర్మ

Image
  మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు - అద నపు కలెక్టర్ రాహుల్ శర్మ నకిరేకల్ మున్సిపాలిటీ సాధారణ ఎన్నిక, నల్గొండమున్సిపాలిటీ 26 వ వార్డు కు ఆకస్మిక ఎన్నిక కౌంటింగ్ రేపు 3 న రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జారీ చేసిన కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.ఆదివారం అదనపు కలెక్టర్ నల్గొండ ఎం.జి.కళాశాల లో నల్గొండ 26 వ వార్డు కౌంటింగ్ నిర్వహిస్తున్న కౌంటింగ్ కేంద్రం,నకిరేకల్  లో ప్రభుత్వ జూనియర్ కళాశాల లో నకిరేకల్ మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం లో ఏర్పాట్లు పరిశీలించారు.కౌంటింగ్  రూమ్ లను  పారిశుధ్య సిబ్బంది క్రిమి సంహరక ద్రావణం తో శానిటైజ్ చేశారు.కోవిడ్ నెగటివ్ పరీక్ష నెగెటివ్ రిపోర్ట్, పాస్ లు కలిగి యున్న ఉన్న అభ్యర్థులు,కౌంటింగ్ ఏజెంట్లు,కౌంటింగ్ సిబ్బంది,మీడియా, అధికారులను అనుమతించనున్నట్లు ఆయన తెలిపారు.ఆదివారం ఎన్. జి.కళాశాల నల్గొండ,నకిరేకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో అభ్యర్థులు, ఏజెంట్ లు,కౌంటింగ్ సిబ్బంది,మీడియాకు ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించారు.కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని ఆయన

కోదాడ గర్ల్స్ మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి లో 80 సీట్లు ఇంటర్మీడియట్ ఎంపీసీలో 40 బైపీసీ లో 40 సీట్లు

Image
  కోదాడ గర్ల్స్ మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి లో 80 సీట్లు ఇంటర్మీడియట్ ఎంపీసీలో 40 బైపీసీ లో 40 సీట్లు కోదాడ గర్ల్స్ మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి లో 80 సీట్లు ఇంటర్మీడియట్ ఎంపీసీలో 40 బైపీసీ లో 40 సీట్లు కలవని మత గురువు  మౌలానా అబ్దుల్ లతీఫ్ తెలియ చేశారు. కోదాడ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల మసీదుల 1)సదర్ 2)ఇమాములు 3)ఆఫీజ్ 4)ఆలీమ్ 5)మసీదు కమిటీలు 6)మైనార్టీ ముఖ్య నేతలను, తమ పరిధిలోని గ్రామాల్లో ప్రజలకు తెలియజెయ్యండని కోరారు. ఈ క్రింది వెబ్ సైట్ ద్వారా htty:// tmreis.telangana.gov.in తెలంగాణలోని అన్ని మైనారిటీ గురుకుల పాఠశాలలో పేద పిల్లలను జాయిన్  కావొచ్చని   ఆయన మరియు  కోదాడ గర్ల్స్ మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్, కోరారు వివరాలకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు 7331170856 9346541637 7569110928

గాంధీ ఆసుపత్రికి drdo నుంచి 100 ఆక్సిజన్ సిలెండర్లను అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Image
  కోవిడ్ రోగుల కోసం  గాంధీ ఆసుపత్రికి drdo నుంచి 100 ఆక్సిజన్ సిలెండర్లను అందజేసిన  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమానికి హాజరైన drdo మిస్సైల్  dg msr ప్రసాద్,గాంధీ సూపరిండెంట్ రాజారావు రాజారావు,గాంధీ superindent కామెంట్స్ కిషన్ రెడ్డి గారు మాకు ఏ ఇబ్బంది ఉన్న వెంటనే రెస్పాండ్ అవుతున్నారు,మాలో   నైతిక స్టైర్యం  నింపుతున్నారు Drdo నుంచి వచ్చిన సిలెండర్లతో మరి కొంతమంది ని కాపాడుకోగలుగుతాం కిషన్ రెడ్డి గారి చొరవ వల్లే అన్ని రకాలుగా గాంధీ సేవలందించగలుగుతుంది కిషన్ రెడ్డి కామెంట్స్ గాంధీ  650 icu పడకలతో దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి గా సేవలందిస్తుంది 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి రోగులు వస్తున్నారు గాంధీకి ఆక్సిజన్ సిలెండర్లను ఇవ్వాలని ఇటీవల డిఫెన్స్ మినిస్టర్ రాజనాధ్ ను కోరగా drdo సతీష్ గారు మిస్సైల్ కు వాడే నైట్రోజన్ సిలెండర్లను ఆక్సిజన్ సిలెండర్లగా కన్వర్ట్ చేసి గాంధీకి పంపారు నేడు 50 వచ్చాయి,రేపు మరో 50 సిలెండర్ల వస్తాయి తెలంగాణ ప్రజల కష్టసుఖాల్లో కేంద్రం తోడు ఎప్పుడూ ఉంటుంది గాంధీ ఆసుపత్రిలో ఆక్సిజన్  కొరత ఉండకూడదని సిఎస్ తో మాట్లాడాను,నివేదిక అందజేయమ

ఎమ్మెల్యే కంచర్ల గృహంలో విజయోత్సావాలు

Image
  ఎమ్మెల్యే కంచర్ల గృహంలో విజయోత్సావాలు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టి ఆర్ యస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నివాసగృహంలో విజయోత్సావాలు జరుపుకుంటున్న టి ఆర్ యస్ నేతలు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,యన్. భాస్కర్ రావు టి ఆర్ యస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు,మాజీ యం ఎల్ సి పూల రవీందర్, కంచర్ల కృష్ణారెడ్డి,కటికం సత్తయ్య గౌడ్,టి ఆర్ యస్ వి నాయకులు జిల్లా శంకర్ తదితరులు.

కిలాడీ లేడీ మోసాలకు చెక్ పెట్టిన నల్లగొండ జిల్లా పోలీసులు*

Image
  *కిలాడీ లేడీ మోసాలకు చెక్ పెట్టిన నల్లగొండ జిల్లా పోలీసులు* - - పెండ్లి సంబంధాల పేరిట అబ్బాయిల పేర్లు మార్చి చెపుతూ మోసాలకు పాల్పడుతున్న యువతి - - సామాజిక మాధ్యమాలు వేదికగా వలపు వల విసురుతూ డబ్బులు దండుకుంటున్న వైనం - - పదుల సంఖ్యలో బాధితులు, న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన బాధితులు నల్లగొండ : పెండ్లి సంబంధం కోసం మీ ఫోటో ఎవరికైనా ఇస్తున్నారా, ఆ వ్యక్తి గురించి మీకు అన్ని వివరాలు తెలిస్తేనే ఇవ్వండి..... లేదంటే ఇలా మోసపోతారని హెచ్చరిస్తున్నారు నల్లగొండ జిల్లా పోలీసులు.... ఇలా అబ్బాయిల ఫోటోలను అమ్మయిల తల్లితండ్రుల వద్ద నకిలీ పేర్లతో, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారంటూ సంబంధం మాట్లాడతానని డబ్బులు దండుకుంటుంది ఈ కిలాడీ లేడి... అంతే కాదు తాను ఎవరి ఫోటోలైతే అమ్మాయిల తల్లితండ్రులకు చూపిస్తుందో వాళ్లను సైతం బెదిరిస్తూ తాను అడిగినంత ఇవ్వకపోతే ఆ కేసులలో ఇరికిస్తానని బెదిరింపులకు పాల్పడుతుంది ఈ మాయలేడి... ఇలా మోసాలకు పాల్పడుతూ డబ్బులు దండుకుంటున్న కిలాడీ లేడీని అరెస్ట్ చేసి ఆమె చేస్తున్న మోసాలకు ఫుల్ స్టాప్ పెట్టారు నల్లగొండ జిల్లా పోలీసులు... ఇక వివరాలలోకి వెళితే ఖమ్మం జిల్లా సత్తుపల్లికి

కౌంటింగ్ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి సూచనలు చేస్తున్న డిఐజి ఏ.వి. రంగనాధ్

Image
  నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బందికి నల్లగొండ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో సూచనలు చేస్తున్న డిఐజి ఏ.వి. రంగనాధ్, ఆయన వెంట డీఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, రమణా రెడ్డి, వెంకటేశ్వర్ రావు, ఇతర పోలీస్ అధికారులు

కరోనా తో కొడుకు మృతి ని తట్టు కోలేక ప్రాణం విడిచిన తండ్రి.

 కరోనా తో కొడుకు మృతి ని తట్టు కోలేక  ప్రాణం విడిచిన తండ్రి.  కరోన మహమ్మారి బారిన పడి కుమారుడు గత నాలుగు రోజుల క్రితం మృత్యువాత పడ్డారు,అదే ఆలోచన తో బెంగ తో తండ్రి తనువు చాలించారు.  నాగారం మున్సిపాలిటీ లోని రాంపల్లి చెందిన నీరుడి వాసు కరోనా తో చికిత్స కోసం నగరం లోని ఆసుపత్రి లో చేరి తనువు చాలించారు,ఆర్థికంగా కుటుంబ పరిస్థితి బాగో లేక ఆసుపత్రి  బిల్లు చెల్లించలేక బాధపడుతూ  తండ్రి బాలయ్య రోజు ఆలోచించి ఆలోచించి తనువు చాలించారు. ఇది విన్న మున్సిపల్ వాసులు కన్నీటి పర్యంతమయ్యారు.కోడలు ఇద్దరు పిల్లలతో ఇంటికి పెద్దలను కోల్పోయి అనాధలు గా మిగిలి పోయారు. అయ్యో భగవంతుడా అని ఏడవడం తప్ప ఏమీ లేకుండా అయిపోయే పాపం అంటూ కాలనీవాసులు శోకసంద్రం లో మునిగిపోయారు కరోన రక్కసి తో కుటుంబం అతలాకుతలం అయి ఆర్థికంగా ఆదుకుంటే తప్ప ఎలాంటి ఆధారం లేని విగత జీవులుగా ఉన్నారు,ఈ తరుణం లో దయ తలిచి తోటి వారు తోచిన విధంగా ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు.

మసాజ్ సెంటర్ పై సైబరాబాద్ స్పెషల్ టీం పోలీసుల దాడి

 కే పి హెచ్ బి పోలీస్ స్టేషన్ పరిధిలో లో మసాజ్ సెంటర్ పై సైబరాబాద్ స్పెషల్ టీం పోలీసుల దాడి  రోడ్ నెంబర్ వన్ లో Spa ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఆర్గనైజర్ మౌనిక శివ, మరో ఇద్దరు విటులు అరెస్ట్.  గత ఏడాది జనవరిలోనూ అరెస్టయిన ఆర్గనైజర్ మౌనిక

కౌంటింగ్ రిహార్సల్స్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్..

 నల్గొండ పట్టణంలో ని గిడ్డంగుల సంస్థ గౌడన్స్ లో ఏర్పాటు చేసిన సాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు,, కౌంటింగ్  రిహార్సల్స్   ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.. RO రోహిత్ సింగ్...  కేంద్ర ఎన్నికల పరిశీలకుడు    సజ్జన్ సింగ్ చవాన్.....

మేళ్లచెరువు ఫ్లైఓవర్ వద్ద orange travels bus బోల్తా పది మందికి గాయాలు

 బ్రేకింగ్ న్యూస్  సూర్యాపేట జిల్లా జిల్లా కోదాడ  NH65  పై  మేళ్లచెరువు ఫ్లైఓవర్ వద్ద  orange travels bus బోల్తా  పది మందికి గాయాలు   39 మంది బస్సులో ప్రయాణిస్తున్నారు   హైద్రాబాద్ నుండి చెరుకుపల్లి వెళ్తుండగా మధ్యలో కోదాడ వద్ద   ఘటన

Remdesiver ఎంపానెల్డ్ కోవిడ్ హాస్పిటల్స్‌కు అనుసంధానించబడిన అధీకృత ఫార్మసీ దుకాణాల వివరాలు వెల్లడించిన నల్గొండ జిల్లా కలెక్టర్

Image
  ఎంపానెల్డ్ కోవిడ్ హాస్పిటల్స్‌కు అనుసంధానించబడిన అధీకృత ఫార్మసీ దుకాణాలు, ఇవి #Remdesiver ను ఆసుపత్రులలో మాత్రమే అనుమతించబడిన ఇన్‌పేషెంట్లకు విక్రయించడానికి అధికారం కలిగి ఉన్నాయని  నల్గొండ జిల్లా కలెక్టర్ ట్విట్టర్ లో వెల్లడించారు https://twitter.com/Collector_NLG/status/1388126673078419461?s=19 https://twitter.com/Collector_NLG/status/1388126673078419461?s=19

కాంట్రాక్ట్ బేసిస్ లో పల్మోనాలజిస్ట్ ను నియమిస్తామన్న నల్గొండ జిల్లా కలెక్టర్

  కాంట్రాక్ట్  బేసిస్  లో  పల్మోనాలజిస్ట్ ను నియమిస్తామన్న నల్గొండ జిల్లా కలెక్టర్ నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు   అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారని. కరోన విలయతాండవం చేస్తున్న పరిస్థితులలో కరోనా వార్డులో రోగులు అధిక సంఖ్యలో జాయిన్ అవుతున్నారని ఆక్సిజన్,వ్వెంటిలేటర్ సౌకర్యం ఉన్నప్పటికీ , పల్మనాలజిస్టు  లేకపోవడం వలన మెరుగైన వైద్యం అందించుటకు ఆటంకంగా ఉన్నదని, వెంటనే  నియమించాలనిKVPS జిల్లా  కార్యదర్శి  పాలడుగు నాగార్జున  నల్గొండ జిల్లా కలెక్టరు కు   వాట్సాప్ లో విజ్ఞప్తి చేయడం తో వెంటనే స్పందించి  కాటాక్టు బేసిస్ లో నియమిస్తున్నామని నల్గొండ  జిల్లా కలెక్టర్  బదులు ఇచ్చారు.

అత్యవసరంగా పల్మోనాలజిస్ట్ ని నియమించండి కలెక్టర్ సారూ - KVPS జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున

Image
  అత్యవసరంగా పల్మోనాలజిస్ట్ ని నియమించండి కలెక్టర్ సారూ - KVPS జిల్లా  కార్యదర్శి  పాలడుగు నాగార్జున                 నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు   అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారని. కరోన విలయతాండవం చేస్తున్న పరిస్థితులలో కరోనా వార్డులో రోగులు అధిక సంఖ్యలో జాయిన్ అవుతున్నారని ఆక్సిజన్,వ్వెంటిలేటర్ సౌకర్యం ఉన్నప్పటికీ , పల్మనాలజిస్టు  లేకపోవడం వలన మెరుగైన వైద్యం అందించుటకు ఆటంకంగా ఉన్నదని, వెంటనే  నియమించాలనిKVPS జిల్లా  కార్యదర్శి  పాలడుగు నాగార్జున  నల్గొండ జిల్లా కలెక్టరు కు  విజ్ఞప్తి చేశారు. కరోనా రోగులకు అత్యధికంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సమస్య వస్తున్నదని, డాక్టర్ లేకపోవడం వలన బయటకు రెఫర్ చేస్తున్నారని, హైదరాబాదు గాందీకి లేదా ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్లడం వలన   ఆర్థికంగా చితికిపోతున్నారని ఆయన తెలిపారు. చివరికి ప్రాణాలు వదిలిన పరిస్థితులు ఉన్నవిని, అదిక ప్రాణనష్టం జరుగనకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

గుట్కా ప్యాకేట్లు పట్టివేత*

Image
 *గుట్కా ప్యాకేట్లు పట్టివేత* నల్గొండ పట్టణంలో నిషేధిత గుట్కా పాన్ మసాలా విక్రయిస్తున్నారనే   విశ్వసనీయ సమాచారం మేరకు నల్గొండ పట్టణంలో ని ప్రకాశం బజార్  లో రైడ్స్ నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.. పిఎల్.మనోజ్ కుమార్ కి చెందిన షాపులో రైడ్ చేయగా అతనికి చెందిన శివాజీ నగర్ గోడౌన్ లో  20 లక్షలు విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకేట్లను రైడ్ చేసి పట్టుకున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారిని వి.జ్యోతిర్మయి. అతని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు..

తిరుమలలో‌ భారీ వర్షం..

 తిరుమలలో‌ భారీ వర్షం..

కేటీఆర్ కు పాజిటివ్

Image
 

మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కోవిడ్ వాక్సినేషన్

మూడో విడత వ్యాక్సినేషన్ కు మార్గదర్శకాలు వెల్లడించిన కేంద్రం  మే 1 నుంచి మూడో విడత  vaccination ప్రక్రియ  మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కోవిడ్ వాక్సినేషన్

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటీవ్‌

Image
 తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటీవ్‌ *యాంటీజన్* పరీక్షల్లో *సీఎం కేసీఆర్ కి కరోనా పాజిటివ్* గా నిర్ధారణ... *ఆర్టీపీసీఆర్* ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వైద్య బృందం... స్వల్ప జలుబు లక్షణాలతో బయటపడ్డ కోవిడ్... ప్రస్తుతం వైద్యుల పర్వ్యవేక్షణలో ఫార్మ్ హౌజ్ లో రెస్ట్ తీసుకుంటున్న సీఎం కేసీఆర్... మొన్న 14న జరిగిన సభలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి తో సహా పలువురు రాజకీయ నాయకులకు సోకిన కరోనా...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కెటిఆర్ పర్యటనలో నిరసన సెగ.

Image
  రాజన్న సిరిసిల్ల జిల్లాలో కెటిఆర్ పర్యటనలో నిరసన సెగ. గతంలో కెటిఆర్ ఇచ్చిన మాట ప్రకారం 30 పడకల  ఆసుపత్రిని నిర్మించాలని సెల్ టవర్ ఎక్కిన బిజేపి కార్యకర్తలు. కెటిఆర్ కార్యక్రమం లో  ఇచ్చిన హామిలని అమలు చేయాలని నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్తలు. తెలంగాణ రాష్ట్రం లో ఉన్న ఉద్యోగ ఖాళీలని భర్తీ చేయాలని  ఎబివివి కార్యకర్తల నిరసన. సంఘటన స్థలంలో ఎబివిపి కార్యకర్తల పై చెయి చేసుకున్న పోలీసులు,టిఆర్ఎస్ కార్యకర్తలు. కాంగ్రెస్, ఎబివిపి,బిజేపి కార్యకర్తలని అరెస్టు చేసి ఇల్లంతకుంట పోలీస్ స్టేషను కి తరలింపు. కెటిఆర్ పర్యటన అనంతరం పోలీస్ స్టేషన్ కి చేరుకున్న టిఆర్ఎస్ నాయకులు. మాటమాట పెరగడంతో పోలిసు స్టేషను కి భారీగా చేరుకున్న టిఆర్ఎస్. ఇల్లంతకుంట పోలీసు స్టేషను లోనే బాహాబహికి దిగిన టిఆర్ఎస్, బిజెపి నాయకులు. బిజేపి, ఎబివిపి నాయకులపై టిఆర్ఎస్ నాయకుల దాడి. పరిస్థితి అదుపుచేయలేక అదనపు పోర్స్ లేక చేతిలో వెఫన్ ఉన్నగాని  ఏం చేయలేకపోతున్ననని పై అధికారులతో ఫోన్ లో బహిరంగంగా వేడుకున్న ఎస్సై. సుమారు రెండు గంటలపాటు ఇల్లంతకుంట పోలీసు స్టేషను లో ఉద్రిక్త పరిస్థితులు

కరోన కేసులు 4009

Image
 

తాండూరులో వాసవి క్లబ్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాగి అంబలి, మజ్జిగ పంపిణీ

Image
 తాండూరులో వాసవి క్లబ్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో  రాగి అంబలి, మజ్జిగ పంపిణీ  వాసవి క్లబ్ తాండూరు జేమ్స్ మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సంయుక్తంగా కలిసి తాండూరు వికారాబాద్ డిస్ట్రిక్ఫ్ లో ఏప్రిల్ 01 నుండి ప్రతి రోజు మధ్యాహ్నం 12.30 నుండి సాయంత్రం 5.00 వరకు రాగి అంబలి, మజ్జిగ  పంపిణీ చేస్తున్నారు. తాండూరు మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి శ్రీ స్వప్న పరిమాల్ గ చేతి మీదుగా పంపిణీ  ప్రారంభించారు   దాతల సహకారం తో  రోజు 50 trs రాగి అంబలి , 50 ltr మజ్జిగ మరియు చల్లని త్రాగు నీరు పంపిణీ చేస్తున్నారు. మే 30 వరకు ఈ కార్యక్రమం నడుస్తుందని, వారం ఒక్క సారి అన్నవితరణ కార్యక్రమం  చేస్తున్నామని  రొంపల్లి సంతోష్ కుమార్ ,వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కాబినెట్ జాయింట్ ట్రేసుర్రెర్,  ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ వికారాబాద్ డిస్ట్రీట్ , లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూరు ట్రేసుర్రెర్ , కొక్కాల సంతోష్ కుమార్ , వైష్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ నందారం నరసింహ  వైష్ ఫెడరేషన్ కోశాధికారి కెలిగారి ప్రవీణ్ కుమార్ ,  వాసవి క్లబ్ అధ్యక్షులు గుముడలా గౌరీశంకర్,  వాసవి క్లబ్ సెక్రటరీ మోముల హరీష్  వాసవి క్లబ్ ట్రేసుర్రెర్

రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు : డిఐజి రంగనాధ్*

Image
  *రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు : డిఐజి రంగనాధ్* - - నాణ్యత, మాయిశ్చర్ లాంటి సాకులతో మద్దతు ధర తగ్గిస్తే సహించేది లేదు - - మద్దతు ధర 1,888, సాధారణ ధాన్యంకు 1,868 చెల్లించాలి - -.మాయిశ్చర్, తాలు, మట్టి లాంటి అంశాలను సాకుగా చూపితే సహించేది లేదు - - రేపటి నుండి రైస్ మిల్లులు, కొనుగోలు కేంద్రాలలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు నల్లగొండ : నాణ్యతా ప్రమాణాలు సరిగా లేవని, మాయిశ్చర్, తాలు, మట్టి లాంటి అంశాలను సాకుగా చూపిస్తూ రైతులకు మద్దతు ధర చెల్లించకుండా మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డిఐజి ఏ.వి. రంగనాధ్. గత కొద్ది రోజులుగా నాణ్యత సరిగా లేదని, ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉన్నదని, తాలు, మట్టి ఎక్కువ ఉన్నదని రైతులు తీసుకువస్తున్న ధాన్యానికి మద్దతు ధర చెల్లించకుండా క్వింటాలుకు మూడు నుండి నాలుగు కిలోలను తగ్గిస్తున్నట్లుగా రైతుల వద్ద నుండి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన తెలిపారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యం నాణ్యత లేకపోతే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు ధాన్యాన్ని పరిశీలించిన తర్వాత నిర్ణయించిన విధంగా ధర చెల్లించాలని తెలిపారు. అలా కాకుండా నాణ్యత, మాయిశ్చర్, తాలు సాకుగా క్వింటాలు

శంషాబాద్‌లో కారు,లారీ ఢీ..నలుగురు మృతి, 15 మందికి గాయాలు

 *శంషాబాద్‌లో కారు,లారీ ఢీ..నలుగురు మృతి, 15 మందికి గాయాలు* రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్‌లో కారును లారీ ఢీకొన్న సంఘటనలో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.  మరో 15 మంది గాయపడ్డారు. లారీ కింద ఆరుగురు కార్మికులు చిక్కుకోగా.. ప్రమాద సమయంలో 30 పైగా కార్మికులు ఉన్నారు. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.

రియాజుద్దీన్ అకాలమరణానికి చింతిస్తూ సంతాపం ప్రకటించిన జర్నలిస్టులు

Image
  ప్రింట్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్  రాష్ట్ర అధ్యక్షుడు రియాజుద్దీన్ అకాలమరణానికి సంతాపసూచకంగా ఈరోజు అసోసియేషన్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో క్లాక్టవర్ సెంటర్లో సంతాప సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రియాజుద్దీన్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోటగిరి దైవాధీనం మాట్లాడుతూ స్వర్గీయ రియాజుద్దీన్ జర్నలిస్ట్ యుద్ధ నౌక అని చిన్న పత్రికల సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటం చేసిన నిరంతర నిరంతర శ్రామికుడు అని కొనియాడారు జర్నలిస్టుల కోసం స్వార్థం లేకుండా సభ్యులందరికీ నిరంతరం అందుబాటులో ఉండి వెన్నంటి ప్రోత్సహించే వాడని అలాంటి వ్యక్తి అనారోగ్యకారణంగా అకస్మాత్తుగా అందరినీ వదిలి వెళ్లిపోవడం బాధాకరమన్నారు ప్రజాశక్తి విలేకరి గా జర్నలిస్ట్ ప్రస్థానం ప్రారంభించి పౌర స్వేచ్ఛ పత్రికా స్థాపించి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఏది అన్నారు ఆయన నిస్వార్థ సేవ జర్నలిస్టులందరికీ ఆదర్శప్రాయం అన్నారు ఆయన ఆశయ సాధన కోసం చిన్న పత్రికల సంపాదకులు విలేకరులు ఐకమత్యంగా కృషి చేయాలన్నారు ప్రభుత్వం చిన్న ప