ద వండర్..డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ 22 ఏళ్ల"క్విట్ స్మోకింగ్" ఉద్యమం అతని తపన , కసి సినిమా రంగం లో పెడితే..రీల్ హీరో మాత్రమే అయ్యేవారు. ఎందరో స్మోకింగ్ కు గుడ్ బై చెప్పేలా చేసిన రియల్ "హీరో" గా..అవార్డు పొందారు మాచన రఘునందన్ "ఎవడైనా పని శ్రద్ధ గా చేస్తాడు,లేదా ఓపిక తో చేస్తారు.వాడేంటి కసి తో చేస్తున్నాడు." ఇది ఓ తెలుగు సినిమా లో డైలాగ్. ఈ డైలాగ్ కు ..ఈ స్టోరీ కి ఏంటి సంబంధం అంటే?! ఏ పని చేసినా.. ఏ పని ఒప్పుకున్నా.. "నా..కేంటీ?!"."నా కేం లాభం".,ఇలా..ఏ పని చేసినా..అందుకు తగ్గ ప్రతిఫలం ఆశించడం సర్వ సాధారణం. కాస్తో..కూస్తో..స్వార్థ చింతన కలిగి ఉండటం కూడా సహజమే. కానీ..స్వలాభం,లాభాపేక్ష వంటివి లేకుండా..ఉండే వారు అరుదు అనే కన్నా బహు అరుదు అనే చెప్పాలి. 22 ఏళ్లుగా తన సమయం,శక్తి,యుక్తి,అన్ని కూడా దేశ హితం కోసం,సమాజ హితం కోసం వెచ్చించి,ఇలాంటి వ్యక్తులు ఉన్నారా?! ఈ లోకం లో..ఈ కలి యుగం లో అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకునే లా.. చేస్తున్నారు ఓ వ్యక్తి,అతను ఓ సాదా సీదా ఉద్యోగి.ఎంతో ఆసక్తికరంగా..ఆశ్చర్యంగానూ ఉండే "రియల్ స్టోరీ" లో ఉన్...