ఇసుక తవ్వకాల నివేదికలపై సందేహాలు ,సలహాలు అభ్యంతరాలు పరిశీలనకు పంపండి - జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి


 

ఇసుక తవ్వకాల నివేదికలపై సందేహాలు ,సలహాలు అభ్యంతరాలు పరిశీలనకు పంపండి - జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి


నల్గొండ: 


ఇసుక తవ్వకాలకు సంబంధించి వివిధ శాఖలు సమర్పించిన నివేదికలను క్రోడీకరించి నల్గొండ జిల్లాకు సంబంధించి రూపొందించిన జిల్లా సమగ్ర నివేదికను (DSR) వెబ్సైట్

https://nalgonda.telangana.gov.in

లో పొందుపరిచినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు .


                జిల్లాలోని ఇసుక తవ్వకాలకు సంబంధించి సాంకేతిక శాఖలైన నీటిపారుదల,గనులు, భూగర్భ జల వనరులు ,టీఎస్ ఎంఐడిసి, అటవీ, రెవెన్యూ, ముఖ్య ప్రణాళిక అధికారి శాఖల నుండి ఇసుక తవ్వకాలపై నివేదికలను కోరడం జరిగిందని ఈ మేరకు ఆయా శాఖలు సమర్పించిన నివేదికలన్నింటిని పూర్తిస్థాయి జిల్లా సమగ్ర నివేదికగా (DSR)గా మార్చి పైన పేర్కొన్న వెబ్సైట్లో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు.వెబ్ సైట్ లో ఉంచిన జిల్లా సమగ్ర నివేదికపై ఏవైనా సందేహాలు ,సలహాలు అభ్యంతరాలు ఉంటే తేదీ 25.10.2025 లోగా admgnlg@gmail.com మెయిల్ కు పరిశీలనకు పంపవలసిందిగా కలెక్టర్ కోరారు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్