దీపావళికి అందరికీ స్వీట్స్‌.. ఈ ఆఫీసర్‌కు మాత్రం ...... బిస్కెట్లా?ఉమ్మడి మెదక్ జోన్ ఏరియా కు PCB office వర్గాల్లో హాట్‌టాపిక్‌!

 



దీపావళికి అందరికీ స్వీట్స్‌.. ఈ ఆఫీసర్‌కు మాత్రం ...... బిస్కెట్లా?ఉమ్మడి మెదక్ జోన్  ఏరియా కు  PCB office వర్గాల్లో హాట్‌టాపిక్‌!


హైదరాబాద్‌: దీపావళి వచ్చిందంటే స్వీట్స్‌ బాక్సులు, డ్రైఫ్రూట్స్‌ ప్యాకెట్లు.. ఇవన్నీ పండుగ శుభాకాంక్షల పేరుతో అధికారుల కార్యాలయాలకు చేరడం కొత్తేమీ కాదు. కానీ ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB)  జోన్‌ పరిధిలో  ఓ ఆఫీసర్ కు ....బిస్కెట్స్ అందాయని వినిపిస్తున్న గుసగుసలు మాత్రం మామూలుగా లేవు. స్వీట్స్‌ బాక్సులతో సరిపెట్టకుండా ఏకంగా ...... బిస్కెట్ల స్థాయికి పండుగ కానుకలు చేరాయా? అన్న చర్చ ఇప్పుడు PCB వర్గాల్లో కలకలం రేపుతోంది.


స్వీట్స్‌ పక్కన పెట్టి ....... బిస్కెట్స్ ఎందుకు?


పరిశ్రమల తనిఖీలు, అనుమతులు, కాలుష్య నియంత్రణ నిబంధనల అమలు.. ఇలా కీలక అధికారాలు కలిగిన శాఖలో పనిచేసే ఓ ఆఫీసర్ చుట్టూ ఈ  బహుమతి ప్రచారం తిరుగుతోంది. పరిశ్రమల యాజమాన్యాల నుంచి పండుగ కానుకగా  అందిందన్న ప్రచారమే ఈ వ్యవహారానికి కేంద్రబిందువుగా మారింది.


అసలు ఆ .... బిస్కెట్లా? ఎవరు ఇచ్చారు? ఏ పరిశ్రమకు చెందిన వారు ఇచ్చారు? కార్యాలయంలోనే అందించారా? మరెక్కడైనా చేతులు మారాయా? అన్న ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.


బాధ్యతలు పెద్దవి.. కానుకలు ఇంకా పెద్దవా?


కాలుష్య నియంత్రణ మండలి అధికారుల చేతుల్లో పరిశ్రమల భవిష్యత్తును ప్రభావితం చేసే తనిఖీలు, అనుమతులు, నిబంధనల అమలు వంటి బాధ్యతలు ఉంటాయి. అలాంటి శాఖలో పనిచేసే అధికారులకు పరిశ్రమల వర్గాల నుంచి ఖరీదైన బహుమతులు అందాయన్న ప్రచారం నిజమైతే అది అత్యంత తీవ్రమైన విషయం. పర్యావరణ పరిరక్షణ బాధ్యతలు నిర్వహించాల్సిన అధికారుల చుట్టూ ఇలాంటి అనుమానాలు ఎందుకు తలెత్తుతున్నాయి?


ఉన్నతాధికారులకు సవాల్‌!


ఈ వ్యవహారంపై TGPCB ఉన్నతాధికారులు మౌనం వీడతారా? ఈ జోన్‌లో దీపావళి కానుకల వ్యవహారంపై విచారణ జరిపిస్తారా? సంబంధిత అధికారుల బహుమతుల స్వీకరణపై ఏమైనా నిబంధనలు ఉల్లంఘించబడ్డాయా అనే కోణంలో పరిశీలిస్తారా?


లేక ఇవన్నీ ఉత్తుత్తి ప్రచారాలంటూ పక్కన పెట్టేస్తారా?


ప్రచారం నిజమో కాదో తేల్చాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదే. ఆధారాలు లేకుండా ఎవరినీ దోషిగా నిలబెట్టలేం. కానీ ప్రజాధనంతో జీతాలు తీసుకుంటూ, పర్యావరణ పరిరక్షణ బాధ్యతలు నిర్వహించే అధికారులపై ఇలాంటి అనుమానాలు తలెత్తినప్పుడు వాటిని తేలిగ్గా తీసుకోవడం కూడా సరికాదు.


గూఢచారి నిఘా కొనసాగుతుంది!


అధికారులు స్పందించినా.. స్పందించకపోయినా ఈ వ్యవహారంపై మా గూఢచారి టీం పరిశీలన కొనసాగుతుంది. ఈ బహుమతి ప్రచారం వెనుక వాస్తవాలేమిటి? ఎవరెవరి పేర్లు తెరపైకి వస్తున్నాయి? ఆధారాలు ఏం చెబుతున్నాయి? అన్నది వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం.


స్వీట్స్‌ బాక్సులకే పరిమితమా? లేక దీపావళి కానుకల పేరుతో .... బిస్కెట్స్ పాలిటిక్స్‌ కూడా నడిచాయా? కాలమే కాదు.. విచారణ కూడా సమాధానం చెప్పాలి!

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు