*ఆఫీసు నుంచి అక్రమంగా నగదు తరలిస్తూ.. జలమండలి జాయింట్ డైరెక్టర్ వద్ద రూ.2.40 లక్షలు పట్టుబడ్డాయి*


 *ఆఫీసు నుంచి అక్రమంగా నగదు తరలిస్తూ.. జలమండలి జాయింట్ డైరెక్టర్ వద్ద రూ.2.40 లక్షలు పట్టుబడ్డాయి*

*హైదరాబాద్, అక్టోబర్ 25:* ఆఫీసులో అక్రమంగా వసూలు చేసిన నగదును ఇంటికి తరలిస్తున్న హైదరాబాద్ జలమండలి జాయింట్ డైరెక్టర్ ఏసీబీకి దొరికిపోయాడు. ఏసీబీ ప్రెస్ నోట్ ప్రకారం ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

ఖైరతాబాద్ లోని హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్ బీ కార్యాలయంలో ఉన్నతాధికారి ఒకరు ఆఫీసు నుంచి అక్రమంగా నగదు వసూలు చేసి ఇంటికి తీసుకెళ్తున్నాడన్న అజ్ఞాత సమాచారం సిటీ రేంజ్-2 ఏసీబీ అధికారులకు అందింది. దీంతో అధికారులు నిఘా పెట్టారు.

అక్టోబర్ 24న రాత్రి 7 గంటల సమయంలో రాజ్ భవన్ రోడ్డులోని మెట్రో రెసిడెన్సీ అపార్ట్ మెంట్ ఎదురుగా TS08 GQ 3699 నంబర్ గల మారుతి స్విఫ్ట్ కారును ఏసీబీ అధికారులు అడ్డగించారు. ఆ కారు జలమండలి జాయింట్ డైరెక్టర్ ఏ. శ్రీనివాస్ ది అని తేలింది.


ఆకస్మిక తనిఖీలో కారులో ఏకంగా రూ.2 లక్షల 40 వేల లెక్కల్లో లేని నగదు పట్టుబడింది. ఆఫీసు నుంచి తిరిగి వస్తుండగా ఇంత నగదు ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేకపోయాడు. పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు.


దీంతో ఆ నగదును అవినీతి కోణంలో విచారణ కోసం పంచనామా కింద స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల కోసం, ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇవ్వడం కోసం నగదును సీజ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు