సరాకా లేబొరేటరీస్ పరిశ్రమలో క్లోరోఫామ్ లీకై ఇద్దరు మృతి చెందిన ఘటనపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తనిఖీ* పరిశ్రమ మూసివేతకు టీజీపీసీబీ ఆదేశాలు*
*సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామంలోని సరాకా లేబొరేటరీస్ పరిశ్రమలో క్లోరోఫామ్ లీకై ఇద్దరు మృతి చెందిన ఘటనపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తనిఖీ*
*పరిస్థితిని సమీక్షించి పరిశ్రమ మూసివేతకు ఆదేశాలు జారీ చేసిన టిజిపిసిబి*
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామంలోని సరాకా లేబొరేటరీస్ లిమిటెడ్ పరిశ్రమలో జరిగిన క్లోరోఫామ్ లీకేజీ ప్రమాద ఘటనపై తెలంగాణ కాలుష్య నియంత్ర మండలి చర్యలు చేపట్టింది.
ఈ ఘటన నేపథ్యంలో ఈరోజు (శుక్రవారం) తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) అధికారులు పరిశ్రమను తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను పరిశ్రమ జనరల్ మేనేజర్ మధు, డిప్యూటీ జనరల్ మేనేజర్ యోగేశ్వర్ రావు ల తెలుసుకున్నారు. నిన్న (22 అక్టోబర్, 2026) రాత్రి సుమారు 11:30 గంటలకు క్లోరోఫామ్ లీకేజీ జరిగిందని, ఆవిరికి గురైన ఇద్దరు వ్యక్తులు అపస్మారక స్థితికి చేరుకోవడంతో వారిని నారాయణ ఆసుపత్రికి తరలించగా, వైద్యుడు మృతి చెందినట్లు ప్రకటించారని వారు పిసిబి అధికారులకు వివరించారు. పరిశ్రమలోని ప్రొడక్షన్ బ్లాక్-2లో, మొదటి అంతస్తులో ఉన్న రియాక్టర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌లోని రిసీవర్‌కు క్లోరోఫామ్ ను బదిలీ చేసే ప్రక్రియలో లేయర్ సెపరేషన్ జరుగుతున్న సమయంలో క్లోరోఫామ్ లీకేజీ జరిగినట్లు వారు వెల్లడించారు. లీకైన క్లోరోఫామ్ వేగంగా ఆ ప్రాంతమంతటా వ్యాపించినట్లు టీజీపీసీబీ అధికారులకు తెలిపారు. ఇతర సాంకేతిక కారణాలను వివరించారు.
*పరిశ్రమ మూసివేతకు టీజీపీసీబీ ఆదేశాలు*
ఈ ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ఈరోజు (23 అక్టోబర్ 2026) సరాకా లేబొరేటరీస్ లిమిటెడ్ పరిశ్రమకు ముందస్తు విచారణ అవకాశం (Opportunity of Hearing) కల్పించకుండానే మూసివేత ఉత్తర్వులు (Closure Order) జారీ చేసింది.
అదే విధంగా, పరిశ్రమకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని సంగారెడ్డి పరిధిలోని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ( టీజీఎస్పీడీసీఎల్ ) అధికారులకూ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది.

Comments
Post a Comment