ఉప్పల శ్రీనివాస్ గుప్తకు ఎమ్మెల్సీ ఇవ్వాలి - మెజారిటీ ఆర్యవైశ్యుల ఆకాంక్ష ఇదేనంటూ డిమాండ్



 

ఉప్పల శ్రీనివాస్ గుప్తకు ఎమ్మెల్సీ ఇవ్వాలి -  మెజారిటీ ఆర్యవైశ్యుల ఆకాంక్ష ఇదేనంటూ డిమాండ్

హైదరాబాద్: తెలంగాణలో ఆర్యవైశ్యుల రాజకీయ ప్రాతినిధ్యాన్ని మరింత పెంచే దిశగా ఉప్పల శ్రీనివాస్ గుప్తకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని మెజారిటీ ఆర్యవైశ్యులు కోరుకుంటున్నారని ఆర్యవైశ్య వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఆర్యవైశ్యుల సామాజిక, రాజకీయ అంశాలపై ఉప్పల శ్రీనివాస్ గుప్త చురుకుగా పనిచేస్తున్నారని ఆయనకు మద్దతుదారులు పేర్కొంటున్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఆర్యవైశ్యుల ఐక్యత, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమం వంటి అంశాలపై పలు సందర్భాల్లో మాట్లాడారు.

ప్రత్యేకంగా ఆర్యవైశ్యులు వ్యాపార రంగానికే పరిమితం కాకుండా రాజకీయంగానూ ఎదగాలని ఆయన పలు కార్యక్రమాల్లో పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో ఆర్యవైశ్యులకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత కల్పించాలంటే ఉప్పల శ్రీనివాస్ గుప్తకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని పలువురు ఆర్యవైశ్యులు కోరుతున్నట్లు తెలుస్తోంది.  ఆర్యవైశ్య వర్గాల్లో వ్యక్తమవుతున్న డిమాండ్ 


Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు