కొణిజేటి రోశయ్య ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్త
కొణిజేటి రోశయ్య ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్త * ఘనంగా మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 93వ జయంతి వేడుకలు * రవీంద్రభారతిలో చిత్రపటానికి నివాళులర్పించిన ప్రముఖులు * ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు హైదరాబాద్ (గూఢచారి న్యూస్): రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరతకు ప్రతీకగా నిలిచిన దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీపీసీసీ (TPCC) ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త పిలుపునిచ్చారు. కొణిజేటి రోశయ్య గారి 93వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లక్డీకాపూల్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం మరియు కొణిజేటి రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన జయంతి సభకు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, టీపీసీసీ అధ్య...